కోబ్‌ మరణంపై 2012లో జోస్యం..ఆ ట్వీట్‌ వెనుక మిస్టరీ ఏంటి..?

| Edited By:

Jan 27, 2020 | 11:05 PM

పాపులర్ బాస్కెట్ బాల్ లెజెండ్ కోబ్ బ్రయంట్ హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించారు. లాస్ఏంజిలిస్‌లోని కలా‌బాసాస్‌లో జరిగిన ఈ దుర్ఘటనలో ఆయన 13 ఏళ్ళ కుమార్తె జియానా కూడా మృతి చెందింది. వీరితో బాటు మరో ఏడుగురు కూడా ప్రాణాలు కోల్పోయారు. వీరు ప్రయాణిస్తున్న సీకోర్సికీ ఎస్-76 హెలికాఫ్టర్ ఓ కొండను ఢీకొని మంటల్లో మండుతూ కూలిపోయింది. కాగా.. ఓ నెటిజన్ ఈ విషయాన్ని 2010 లోనే ఉహించాడు. 2012లో ట్విట్టర్ లో షేర్ చేసిన ఆ ట్వీట్ […]

కోబ్‌ మరణంపై 2012లో జోస్యం..ఆ ట్వీట్‌ వెనుక మిస్టరీ ఏంటి..?
Follow us on

పాపులర్ బాస్కెట్ బాల్ లెజెండ్ కోబ్ బ్రయంట్ హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించారు. లాస్ఏంజిలిస్‌లోని కలా‌బాసాస్‌లో జరిగిన ఈ దుర్ఘటనలో ఆయన 13 ఏళ్ళ కుమార్తె జియానా కూడా మృతి చెందింది. వీరితో బాటు మరో ఏడుగురు కూడా ప్రాణాలు కోల్పోయారు. వీరు ప్రయాణిస్తున్న సీకోర్సికీ ఎస్-76 హెలికాఫ్టర్ ఓ కొండను ఢీకొని మంటల్లో మండుతూ కూలిపోయింది.

కాగా.. ఓ నెటిజన్ ఈ విషయాన్ని 2010 లోనే ఉహించాడు. 2012లో ట్విట్టర్ లో షేర్ చేసిన ఆ ట్వీట్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అయింది. ‘.నోసో’ అనే వ్యక్తి.. బాస్కెట్‌బాల్‌ దిగ్గజం హెలికాఫ్టర్‌ ప్రమాదంలో మరణిస్తాడని 2012 నవంబర్‌ 14న ట్వీట్‌ చేశాడు. యాదృచ్చికంగా, బ్రయంట్ అదే విధంగా తన ప్రాణాలను కోల్పోయాడు. సోమవారం తెల్లవారుజామున బ్రయంట్ మరణ వార్త తెలియడంతో ఆ పోస్ట్ చేసిన వ్యక్తి క్షమాపణలు చెప్పారు.

[svt-event date=”27/01/2020,5:30PM” class=”svt-cd-green” ]