హిమాచల్ ప్రదేశ్ లో కుప్పకూలిన మూడంతస్తుల భవనం!

| Edited By:

Jul 14, 2019 | 7:42 PM

హిమాచల్ ప్రదేశ్ లోని సోలన్ జిల్లాలో సుమారు 30 మంది ఉన్న భవనం పేకమేడలా కుప్పకూలిపోయింది. సోలన్ జిల్లాలోని కుమారహట్టి-నహం రోడ్ సమీపంలో మూడు అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. మధ్యాహ్నం 3.50 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. భవన శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు నలుగురు ఆర్మీ జనాన్లను రక్షించినట్లు తెలుస్తోంది. భవనంలోని హాలులో ఉండగా ప్రమాదం జరిగింది. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలను […]

హిమాచల్ ప్రదేశ్ లో కుప్పకూలిన మూడంతస్తుల భవనం!
Follow us on

హిమాచల్ ప్రదేశ్ లోని సోలన్ జిల్లాలో సుమారు 30 మంది ఉన్న భవనం పేకమేడలా కుప్పకూలిపోయింది. సోలన్ జిల్లాలోని కుమారహట్టి-నహం రోడ్ సమీపంలో మూడు అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. మధ్యాహ్నం 3.50 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. భవన శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు నలుగురు ఆర్మీ జనాన్లను రక్షించినట్లు తెలుస్తోంది. భవనంలోని హాలులో ఉండగా ప్రమాదం జరిగింది. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలను ముమ్మరం చేశారు.