నూతన ఒరవడి : హెచ్​ఐవీ పాజిటివ్​ జంటలకు పెళ్లిళ్లు

|

Oct 04, 2020 | 11:01 PM

హెచ్​ఐవీ ఇదో మహమ్మారి జబ్బు. ఈ వ్యాధి ఉన్నవారిని వివక్షతో చూసిన సందర్బాలు మనం ఇప్పటికీ చూస్తున్నాం. హెచ్​ఐవీ సోకినవారు కూడా మనలాంటి మనుషులే.

నూతన ఒరవడి : హెచ్​ఐవీ పాజిటివ్​ జంటలకు పెళ్లిళ్లు
Follow us on

హెచ్​ఐవీ ఇదో మహమ్మారి జబ్బు. ఈ వ్యాధి ఉన్నవారిని వివక్షతో చూసిన సందర్బాలు మనం ఇప్పటికీ చూస్తున్నాం. హెచ్​ఐవీ సోకినవారు కూడా మనలాంటి మనుషులే. ఏ వ్యక్తి కావాలని హెచ్​ఐవీ బారినపడరు. ఈ విషయం ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. కాగా తమిళనాడు తూత్తుకుడి జిల్లాలోని ఆనందపురంలో ఉన్న కల్వరీ ఛాపెల్​ ట్రస్ట్​.. హెచ్​ఐవీ బాధితులకు భరోసాను ఇస్తుంది. వారి ఆశలకు అండగా నిలుస్తోంది. వారిని చేరదీసి మంచి విద్య అందిస్తోంది. వారిలో చాలా మంది ఇప్పుడు మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. అయితే ఇటీవలే మరో అడుగు ముందుకేసింది ట్రస్ట్​. హెచ్​ఐవీ పాజిటివ్​ ప్రేమికులకు ఓ వేడుక నిర్వహించి పెళ్లిళ్లు చేసింది. తూత్తుకుడి జిల్లా కలెక్టర్​ సందీప్​ నండూరి సమక్షంలో 10 హెచ్​ఐవీ పాజిటివ్​ జంటలు దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టాయి. ఇలాంటి వేడుక నిర్వహించడం చాలా గొప్ప విషయమని ప్రశంసించారు కలెక్టర్ సందీప్​. ట్రస్ట్​ సభ్యులను అభినందించారు. అనంతరం హెచ్​ఐవీ బాధితులకు అండగా నిలిచిన వారికి అవార్డులు అందించింది ట్రస్ట్​.

Also Read :

వాట్సాప్‌లో కొత్తగా అదిరిపోయే‌ ఫీచర్స్‌

గుంటూరు జిల్లా : వింత వ్యాధితో కోళ్లు మృత్యువాత