టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు… దేశ రాజకీయాల్లోనే అరుదు: కేటీఆర్‌

ఈ నెలాఖరులోపు పార్టీ సభ్యత్వ నమోదు పూర్తి చేయాలని టీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పార్టీ శ్రేణులను ఆదేశించారు. పార్టీ సభ్యత్వ నమోదుపై తెలంగాణ భవన్‌లో సుమారు ఐదు గంటలపాటు సమీక్ష నిర్వహించిన ఆయన.. నియోజకవర్గాల వారీగా సభ్యత్వ తీరుపై బాధ్యులను అడిగి తెలుసుకున్నారు. నెలలోనే 50 లక్షల సభ్యత్వ నమోదు కావడం దేశ రాజకీయాల్లో అరుదని కేటీఆర్‌ పేర్కొన్నారు. సభ్యత్వ నమోదు చేసుకున్న వారందరికీ ఆగస్టు 1 నుంచి బీమా సౌకర్యం కల్పించనున్నట్లు స్పష్టం చేశారు. […]

టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు... దేశ రాజకీయాల్లోనే అరుదు: కేటీఆర్‌
Follow us

| Edited By:

Updated on: Jul 27, 2019 | 1:57 AM

ఈ నెలాఖరులోపు పార్టీ సభ్యత్వ నమోదు పూర్తి చేయాలని టీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పార్టీ శ్రేణులను ఆదేశించారు. పార్టీ సభ్యత్వ నమోదుపై తెలంగాణ భవన్‌లో సుమారు ఐదు గంటలపాటు సమీక్ష నిర్వహించిన ఆయన.. నియోజకవర్గాల వారీగా సభ్యత్వ తీరుపై బాధ్యులను అడిగి తెలుసుకున్నారు. నెలలోనే 50 లక్షల సభ్యత్వ నమోదు కావడం దేశ రాజకీయాల్లో అరుదని కేటీఆర్‌ పేర్కొన్నారు. సభ్యత్వ నమోదు చేసుకున్న వారందరికీ ఆగస్టు 1 నుంచి బీమా సౌకర్యం కల్పించనున్నట్లు స్పష్టం చేశారు. 70 వేలకుపైగా సభ్యత్వ నమోదుతో గజ్వేల్, పాలకుర్తి నియోజకవర్గాలు ముందున్నాయన్నారు. సభ్యత్వ నమోదు పూర్తయిన నియోజకవర్గాల్లో బూత్ కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సభ్యత్వ రుసుం కింద 15 కోట్ల రూపాయలు పార్టీ ప్రధాన కార్యాలయానికి అందాయని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వర్ రెడ్డి మీడియాకు తెలిపారు.