కిడ్నీ ముఠాను గుట్టురట్టు చేసిన పోలీసులు

ఇంటర్నేషనల్ కిడ్నీ రాకెట్ మాఫియాకు చెక్ పెట్టారు హైదరాబాద్ రాచకొండ పోలీసులు. సోషల్ మీడియా వేదికగా కిడ్నీ కావాలని ప్రకటన చేసి.. అమాయక ప్రజలకు డబ్బు ఆశ చూపి మోసాలకు పాల్పడుతున్న ప్రధాన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీకి చెందిన అమ్రిష్ ప్రతాప్, సందీప్ కుమార్, రిథికా 2013 నుంచి కిడ్నీ మార్పిడి చేస్తూ భారీగా ఆస్తులు కూడబెట్టారు. ఫేస్‌బుక్, వాట్సాప్‌లో ప్రకటనలు చేస్తూ.. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారిని లక్ష్యంగా చేసుకుని ముఠా సభ్యులు […]

కిడ్నీ ముఠాను గుట్టురట్టు చేసిన పోలీసులు
Follow us

| Edited By:

Updated on: Apr 02, 2019 | 12:34 PM

ఇంటర్నేషనల్ కిడ్నీ రాకెట్ మాఫియాకు చెక్ పెట్టారు హైదరాబాద్ రాచకొండ పోలీసులు. సోషల్ మీడియా వేదికగా కిడ్నీ కావాలని ప్రకటన చేసి.. అమాయక ప్రజలకు డబ్బు ఆశ చూపి మోసాలకు పాల్పడుతున్న ప్రధాన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీకి చెందిన అమ్రిష్ ప్రతాప్, సందీప్ కుమార్, రిథికా 2013 నుంచి కిడ్నీ మార్పిడి చేస్తూ భారీగా ఆస్తులు కూడబెట్టారు. ఫేస్‌బుక్, వాట్సాప్‌లో ప్రకటనలు చేస్తూ.. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారిని లక్ష్యంగా చేసుకుని ముఠా సభ్యులు వ్యాపారం కొనసాగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తికి సోషల్ మీడియా వేదికగా ఈ ముఠా పరిచయమైంది. డబ్బు ఆశచూపి.. ఒక్క కిడ్నీకి రూ. 20లక్షలు ఇస్తామని డీల్ కుదుర్చుకున్నారు. మొదట బాధితుడిని ఢిల్లీకి తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించారు. అంతేకాదు.. భార్య తరపు బంధువులకు కిడ్నీ ఇస్తున్నట్లు నకిలీ పత్రాలు సృష్టించారు. గతేడాది ఆగష్టులో టర్కీకి తీసుకెళ్లి సర్జరీ చేయించారు. అనంతరం డబ్బులు ఇవ్వకుండా మోసం చేసి బెదిరించారు. దీంతో.. బాధితుడు హైదరాబాద్ చేరుకుని పోలీసులను ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన సైబర్ సెల్ పోలీసులు.. ఢిల్లీ వెళ్లి ప్రధాన నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

ఈజిప్టు, సింగపూర్, టర్కీలో.. ఈ ముఠా కిడ్నీ రాకెట్ నడుపుతున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ కుంభకోణంలో పలువురు వైద్యుల హస్తమున్నట్టు తెలుస్తోంది. నిందితుల నుంచి ల్యాప్‌టాప్, మొబైల్ ఫోన్లు, ప్రింటింగ్, లేజర్ మిషన్లు, క్రెడిట్, డెబిట్ కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
పెళ్లి డ్రెస్ కు కొత్త రూపం ఇచ్చిన సమంత.. ఇకపై ఇలాగే..
పెళ్లి డ్రెస్ కు కొత్త రూపం ఇచ్చిన సమంత.. ఇకపై ఇలాగే..
శ్రీశైలంలో ఘనంగా శ్రీ భ్రమరాంబికాదేవికి కుంభోత్సవం
శ్రీశైలంలో ఘనంగా శ్రీ భ్రమరాంబికాదేవికి కుంభోత్సవం
హుండీలోని రూ 2 వేల నోట్ల మార్పిడికి ఆర్బీఐ గ్రీన్‌ సిగ్నల్
హుండీలోని రూ 2 వేల నోట్ల మార్పిడికి ఆర్బీఐ గ్రీన్‌ సిగ్నల్
మల్లె పువ్వుతో అందమే కాదు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయ్!
మల్లె పువ్వుతో అందమే కాదు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయ్!
ఫ్రేషర్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన దిగ్గజ టెక్ కంపెనీ.. 6 వేల మంది
ఫ్రేషర్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన దిగ్గజ టెక్ కంపెనీ.. 6 వేల మంది
ముసుగు చాటున అందాల ముద్దుగుమ్మ.. ముక్కుపుడకనే అసలు అట్రాక్షన్..
ముసుగు చాటున అందాల ముద్దుగుమ్మ.. ముక్కుపుడకనే అసలు అట్రాక్షన్..
జూబ్లీహిల్స్‌లో కోట్ల విలువైన వజ్రాభరణాలు చోరీ..
జూబ్లీహిల్స్‌లో కోట్ల విలువైన వజ్రాభరణాలు చోరీ..
డిగ్రీ పాస్‌ అయితే చాలు.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.
డిగ్రీ పాస్‌ అయితే చాలు.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.
గర్భిణీలకు ఈ లోపం ఉంటే.. పుట్టే బిడ్డలకు డయాబెటిస్‌ ముప్పు..
గర్భిణీలకు ఈ లోపం ఉంటే.. పుట్టే బిడ్డలకు డయాబెటిస్‌ ముప్పు..