రూ.200… కెన్యా మంత్రి కహానీ!

ముంబై: వేల కోట్లు అప్పు చేసినా.. కట్టకుండా దర్జాగా చలామణీ అవుతున్న ఈరోజుల్లో.. ఎప్పుడో 30 ఏళ్ళ క్రితం చేసిన అప్పును తీర్చడానికి ఓ వ్యక్తి ఏకంగా సముద్రాలు దాటి కెన్యా నుంచి ఇండియాకు రావడం నిజంగా ప్రశంసించాల్సిన అంశం. ఇక ఆ వ్యక్తి ఎంపీ కావడం విశేషం. అసలు వివరాల్లోకి వెళ్తే.. ముంబై‌లో నివసిస్తున్న 79 ఏళ్ల కాశీనాథ్‌ గావ్లీ ఇంటికి రెండు రోజుల క్రితం అనుకోని అతిథిలా కెన్యా ఎంపీ రిచర్డ్ టోంగ్ అనే […]

రూ.200... కెన్యా మంత్రి కహానీ!
Follow us

|

Updated on: Jul 12, 2019 | 12:37 PM

ముంబై: వేల కోట్లు అప్పు చేసినా.. కట్టకుండా దర్జాగా చలామణీ అవుతున్న ఈరోజుల్లో.. ఎప్పుడో 30 ఏళ్ళ క్రితం చేసిన అప్పును తీర్చడానికి ఓ వ్యక్తి ఏకంగా సముద్రాలు దాటి కెన్యా నుంచి ఇండియాకు రావడం నిజంగా ప్రశంసించాల్సిన అంశం. ఇక ఆ వ్యక్తి ఎంపీ కావడం విశేషం. అసలు వివరాల్లోకి వెళ్తే.. ముంబై‌లో నివసిస్తున్న 79 ఏళ్ల కాశీనాథ్‌ గావ్లీ ఇంటికి రెండు రోజుల క్రితం అనుకోని అతిథిలా కెన్యా ఎంపీ రిచర్డ్ టోంగ్ అనే వ్యక్తి వచ్చాడు. 30 ఏళ్ల క్రితం కాశీనాథ్‌ గారు తనకు రూ. 200 సాయం చేశారని.. ఆ అప్పు తీర్చడం కోసం వచ్చానని చెప్పడంతో కాశీనాథ్‌ ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు.

ఈ విషయంపై రిచర్డ్ మాట్లాడుతూ.. ‘1985-89 కాలంలో నేను మేనేజ్‌మెంట్‌ కోర్సు చడవడం కోసం ఇండియా వచ్చాను. అప్పుడు నేను వాంఖేడ్‌నగర్‌ ప్రాంతంలో ఉండేవాడిని. ఇక అదే ప్రాంతంలో కాశీనాథ్‌ గారి కుటుంబం కిరాణ షాపు నడుపుతుండేవారు. ఒకానొక సందర్భంలో నాకు కాశీనాధ్ గారు రూ. 200 సాయం చేశారు. అప్పుడు ఆ అప్పును తిరిగి చెల్లించే పరిస్థితి నాకు లేదు. కానీ ఎలాగైనా ఆయన రుణం తీర్చుకోవాలని అనుకున్నా.. ఇక ఆ కోరిక ఇప్పటికి తీరిందని’ రిచర్డ్ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.

నన్ను చూసి కాశీనాధ్ గారు చాలా ఆశ్చర్యపోయారు. ఇప్పటికీ తనను గుర్తుపెట్టుకుని వచ్చినందుకు ఆయన ఎంతో సంతోషించారని రిచర్డ్ తెలిపారు. తాను కెన్యాలో ఎంపీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నానని.. కాశీనాధ్ గారిని ఒకసారి తన దేశం రావాల్సిందిగా ఆహ్వానించానని తెలిపాడు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.