కేబీఆర్ పార్క్ మూసివేత : హైకోర్టు నోటీసులు

మార్నింగ్ వాకర్స్  కోసం హైదరాబాద్‌లోని కెబీఆర్ నేషనల్ పార్కు పున:ప్రారంభించడంపై స్టాండ్ ఏంటో చెప్పాలని అటవీ కార్యదర్శికి, ప్రధాన అడవుల సంరక్షణాధికారికి, డిఎఫ్‌ఓలకు తెలంగాణ హైకోర్టు జస్టిస్ ఏ రాజశేఖర్ రెడ్డి మంగళవారం నోటీసులు జారీ చేశారు.

కేబీఆర్ పార్క్ మూసివేత : హైకోర్టు నోటీసులు
Follow us

|

Updated on: Sep 23, 2020 | 3:34 PM

మార్నింగ్ వాకర్స్  కోసం హైదరాబాద్‌లోని కెబీఆర్ నేషనల్ పార్కు పున:ప్రారంభించడంపై స్టాండ్ ఏంటో చెప్పాలని  అటవీ కార్యదర్శికి, ప్రధాన అడవుల సంరక్షణాధికారికి, డిఎఫ్‌ఓలకు తెలంగాణ హైకోర్టు జస్టిస్ ఏ రాజశేఖర్ రెడ్డి మంగళవారం నోటీసులు జారీ చేశారు. అన్‌లాక్ 4.0 సమయంలో కూడా పార్కును తిరిగి తెరవడంలో అటవీ శాఖ శ్రద్ద చూపకపోవడాన్ని ప్రశ్నిస్తూ టైక్వాండో మాస్టర్ ఎం జయంత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయమూర్తి విచారించారు.  వాకర్స్, వివిధ వర్గాల ప్రజలు యోగా చెయ్యడానికి,  తాజా ఆక్సిజన్ పీల్చుకోవడానికి  పార్క్ కు వస్తారని తెలిపారు. కోవిడ్ సమంయలో ఫ్రెస్ ఎయిర్ చాలా అవసరమని అభిప్రాయపడ్డారు. షాపులు, మాల్స్,  మెట్రో సర్వీసులు నడుస్తున్నప్పటికీ పార్క్ ఇప్పటికీ  మూసివేసి ఉంచడం  ఆశ్యర్యానికి గురి చేస్తుందని కోర్టుకు తెలిపారు. పార్కును తిరిగి తెరవడానికి అటవీ అధికారులకు అనేక అర్జీలు పెట్టుకున్నప్పటికీ ఫలితం లేదని తెలిపారు. కేబీఆర్ పార్కులో అధిక సంఖ్యలో ఔషధ మొక్కలు అందుబాటులో ఉంటాయని, ఆ ప్రదేశంలో వాకింగ్ చేయడం వలన చాలా మేలు కలుగుతుందని తెలిపారు. పిటిషనర్ లేవనెత్తిన అంశాలపై సంబంధిత అధికారుల నుంచి సెప్టెంబర్ 28 లోగా న్యాయమూర్తి సమాధానాలు కోరారు.

Also Read :

Bigg Boss Telugu 4 : కుమార్ సాయికి అదే బలంగా మారిందా..?

సీఎం జగన్ మరో విప్లవాత్మక పథకం, సెప్టెంబర్ 28న శ్రీకారం