Breaking News
  • ఢిల్లీ: భారత్ లో విజృంభిస్తున్న కరోనా వైరస్. ఒక లక్ష 45 వేల మార్క్ ని దాటినా కరోనా పాజిటివ్ కేస్ లు. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 145380. దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 80722. కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 60491. దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 4167. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • కరోనా తెలంగాణా బులిటిన్. ఇవ్వాళ తాజాగా 71 పాజిటివ్ కేసులు నమోదు. మొత్తం రాష్ట్రంలో 1991 కరోనా పాజిటివ్ కేసులు . ఇవ్వాళ మృతులు 1. మొత్తం ఇప్పటివరకు 57 మంది కరోనా కు బలి అయ్యారు. యాక్టీవ్ కేసులు 650 మంది చికిత్స పొందుతున్నారు.
  • ఈ రోజు ఒకరికి CRPF జవాన్ కి కరోనా పాజిటివ్ ఉన్నట్లు దృవీకరించిన వైద్యులు. దేశ వ్యాప్తంగా మొత్తం 369 CRPF సిబ్బందికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు దృవీకరణ 141 యాక్టీవ్ కేస్ లు. 226 మంది డిశ్చార్జ్. ఇద్దరు మృతి.
  • అమరావతి: రేపు ,ఎల్లుండి టిడిపి మహానాడు. రేపు ఉదయం 10.30 కు మంగళగిరి పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించనున్న చంద్రబాబు. ప్రతినిధులను ఉద్దేశించి ప్రారంభ ఉపన్యాసం ఇవ్వనున్న టిడిపి అధినేత చంద్రబాబు. కరోనా, లాక్ డౌన్ నిబంధనలు నేపథ్యంలో జూమ్ ద్వారా ఆన్ లైన్ లో మహానాడు నిర్వహణ. ఆన్ లైన్ ద్వారా మహానాడు లో పాల్గొననున్న 14 వేల మంది ప్రతినిధులు. 14 తీర్మానాలను ఆమోదించనున్న మహానాడు.
  • అమరావతి: అధికార వికేంద్రీకరణ బిల్లు పరిశీలనకు మండలి చైర్మన్ సెలెక్ట్ కమిటీ వేయాలని ఆదేశించిన అమలు కావడం లేదని హైకోర్టులో పిటిషన్ వేసిన టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి. 8 మంది సభ్యులతో కమిటీ వేయాలని మండలి చైర్మన్ ఆదేశించినా మండలి కార్యదర్శి అమలు చేయడం లేదని పిటిషన్ లో తెలిపిన దీపక్ రెడ్డి. నేడు విచారణ జరపనున్న హైకోర్టు.
  • హైకోర్టు జడ్జీలను కించపరుస్తూ పెట్టిన పోస్టులను హైకోర్టు సుమోటోగా స్వీకరించటంపై హర్షం వ్యక్తంచేసిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ. ప్రభుత్వం చేస్తున్న తప్పులను హైకోర్టు అడ్డుకుంటే ప్రజా ప్రతినిధులయ్యుండి సిగ్గులేకుండా హైకోర్టు వ్యతిరేకంగా పోస్టులు పెడతారా? హైకోర్టు జడ్జిలపై పోస్టులను హైకోర్టు సుమోటోగా స్వీకరించి 49 మందికి నోటీసులు జారీ చేసింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇలాంటి తొట్టిగ్యాంగ్ ను ప్రోత్సహించటం సరికాదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడితే కేసులు పెడుతున్న ప్రభుత్వం హైకోర్టు జడ్జిలపై పోస్టులు పెట్టే వారిని ఎందుకు కాపాడుతున్నది? పోస్టులు పెట్టిన వారిపై తక్షణం చర్యలు తీసుకోవాలి - రామకృష్ణ.

వంట‌ల‌క్క ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్…

karthika deepam serial latest news, వంట‌ల‌క్క ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్…

కార్తీకదీపం సీరియ‌ల్ గురించి తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌ల‌కు ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ప్ర‌స్తుతం రేటింగ్స్ ప‌రంగా కార్తీకదీపం దుమ్మురేపుతోంది. స్టార్ హీరోల సినిమాలు తొలిసారి ప్లే అయిన‌ప్పుడు, కీల‌క‌మైన క్రికెట్ మ్యాచ్ లు కూడా దాటి రేటింగ్స్ లో స‌త్తా చాటుతోంది. ముఖ్యంగా ఈ సీరియ‌ల్ లో కీల‌క పాత్ర పోషిస్తోన్న వంట‌ల‌క్క‌కు ఉన్న ఫ్యాన్ బేస్ అయితే వ‌ర్ణ‌ణాతీతం. అయితే, ఈ సీరియ‌ల్ ను మొద‌టి నుంచి ఫాలో అవ్వ‌నివాళ్ల‌కు ఓ గుడ్ న్యూస్.

ప్రస్తుతం కరోనా లాక్ డౌన్ నేప‌థ్యంలో… అన్ని సినిమా, సీరియల్స్ షూటింగ్స్ కంప్లీట్ గా ఆగిపోయాయి. దీంతో బ్యాక‌ప్ పెట్టిన ఎపిసోడ్స్ కూడా అయిపోవ‌డంతో..అన్ని సీరియ‌ల్స్ ను మొద‌ట్నుంచి రీ టెలికాస్ట్ చెయ్య‌డం ప్రారంభించారు. కార్తీకదీపం సీరియల్ ప్ర‌జంట్ తిరిగి ప్ర‌సార‌మ‌వుతోంది. దీంతో మొద‌ట్నుంచి సీరియ‌ల్ ఫాలో అవ్వ‌ని వాళ్ల‌కి.. డాక్టర్ బాబుకి, వంటలక్కకి మధ్య పరిచయం ఎలా? వారిద్దరూ ఎప్పుడు..ఎందుకు..ఎలా కలిశారు? ? అస‌లు గ‌తంలో జ‌రిగిన అంశాలు ఏంటి అని చాలామందికి యాంగ్జైటీ ఉంటుంది. ఇప్పుడు ఆ విష‌యాల్నీ తెలుసుకోవ‌చ్చు. లాక్ డౌన్ ఎన్ని రోజులు ఉంటుంది అనేదాన్ని బ‌ట్టి ఎపిసోడ్స్ ప్లే అవుతాయి. లాక్ డౌన్ కాలం ముగిసి.. షూటింగ్ చేసి, ఎడిటింగ్, డ‌బ్బింగ్ కంప్లీట్ అయ్యేవ‌ర‌కు చాలాసమ‌యం ప‌ట్టే అవ‌కాశం ఉంది. అప్పటి వరకు ఆపాత ఎపిసోడ్స్ ను చూసి ఎంజాయ్ చేయెచ్చు.

Related Tags