తెలంగాణ‌లో ముగ్గురు జ‌ర్న‌లిస్టుల‌కు క‌రోనా !

మహబూబ్ నగర్‌లో ఓ న్యూస్ ఛానెల్‌‌కు చెందిన స్టాఫ్ రిప్టోరర్‌‌తోపాటు కెమెరా మ్యాన్, మరో న్యూస్ ఛానెల్ స్టాఫ్ రిపోర్టర్‌కు క‌రోనా వైర‌స్ సోకిన‌ట్లుగా తెలుస్తోంది.

తెలంగాణ‌లో ముగ్గురు జ‌ర్న‌లిస్టుల‌కు క‌రోనా !
Follow us

|

Updated on: Apr 22, 2020 | 2:41 PM

ప్రపంచదేశాలను కరోనా వైరస్ మహమ్మారి తీవ్రంగా వణికిస్తోంది. మహమ్మారి దెబ్బకు ఆర్ధిక వ్యవస్థలు చిన్నాభిన్నం కాగా.. ప్రపంచంలోని సగానికి కంటే ఎక్కువ మంది ఇళ్లలోనే గడుపుతున్నారు. ఇంత‌టి క్లిష్ట ప‌రిస్థితుల్లోనూ పోలీసులు, వైద్యులు, పారిశుద్ధ్యా సిబ్బంది, మీడియా ప్ర‌తినిధులు త‌మ విధుల‌ను నిర్వ‌హిస్తున్నారు  రోజుకూ పంజా విసురుతున్న కోవిడ్ వీరిని కూడా వెంబ‌డిస్తోంది. తాజాగా తెలంగాణ‌లో ప‌లువురు మీడియా ప్ర‌తినిధుల‌ను ఐసోలేష‌న్‌కు త‌ర‌లించారు.
మహబూబ్ నగర్‌లో ఓ న్యూస్ ఛానెల్‌‌కు చెందిన స్టాఫ్ రిప్టోరర్‌‌తోపాటు కెమెరా మ్యాన్, మరో న్యూస్ ఛానెల్ స్టాఫ్ రిపోర్టర్‌కు క‌రోనా వైర‌స్ సోకిన‌ట్లుగా తెలుస్తోంది. దీంతో వారిని ఐసోలేషన్‌కు త‌ర‌లించారు. గద్వాలకు చెందిన మరో స్టాఫర్‌ను కూడా ఐసోలేషన్‌లో ఉంచిన‌ట్లుగా స‌మాచారం. అయితే వీరికి ఎలా వైర‌స్ సోకింద‌నేది ప‌రిశీలిస్తే…గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి అనుచరుడు ఒకరు ఇటీవల చనిపోగా.. ఆయన అంత్యక్రియల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. కాగా మరణించిన వ్యక్తి కుటుంబ కుటుంబ సభ్యుల్లో ఒకరికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో వెంటనే అప్రమత్తమైన ఎమ్మెల్యే గత శనివారం నుంచి హోం క్వాంరటైన్లోకి వెళ్లిపోయారు. అయితే, ఐదు రోజుల క్రితం జర్నలిస్టులు ఎమ్మెల్యేను కాంటాక్ట్ అయినట్లు పోలీసులకు సమాచారం అందింది. అటు, గద్వాలలో పని చేస్తున్న ఓ న్యూస్ ఛానెల్ రిపోర్టర్ తమ్ముడికి కూడా కరోనా పాజిటివ్ అని తేలినట్లు సమాచారం. వాళ్ల ఇంటికి సదరు ఛానల్ సిబ్బంది వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ముందు జాగ్రత్తగా జర్నలిస్టులను ఐసోలేషన్‌కు తరలించారు. మీడియా ప్ర‌తినిధుల‌కు క‌రోనా ల‌క్ష‌ణాలు అని తెలియ‌టంతో జిల్లాలో మ‌రింత ఆందోల‌న మొద‌లైంది.