కడప సెంట్రల్ జైలుకు జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డి

జేసీ ట్రావెల్స్‌ ముసుగులో అక్రమాలకు పాల్పడ్డారన్న అభియోగాలపై అరెస్ట్ అయిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన తనయుడు జేసీ అస్మిత్ రెడ్డిలను పోలీసులు కడప సెంట్రల్ జైలుకు తరలించారు. శనివారం సాయంత్రం వారిద్దరిని న్యాయమూర్తి ముందు హాజరుపరచగా.. ఇద్దరికి 14 రోజుల రిమాండ్‌ విధించి రెడ్డిపల్లిలోని జిల్లా జైలుకు తరలించాలని పోలీసులు ఆదేశించారు. అయితే ఆ జైలులో ఓ ఖైదీకి కరోనా అనుమానిత లక్షణాలు ఉండటంతో.. వారిద్దరిని అక్కడికి అనుమతి ఇవ్వలేదు. ఇక […]

కడప సెంట్రల్ జైలుకు జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డి
Follow us

| Edited By:

Updated on: Jun 14, 2020 | 6:10 PM

జేసీ ట్రావెల్స్‌ ముసుగులో అక్రమాలకు పాల్పడ్డారన్న అభియోగాలపై అరెస్ట్ అయిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన తనయుడు జేసీ అస్మిత్ రెడ్డిలను పోలీసులు కడప సెంట్రల్ జైలుకు తరలించారు. శనివారం సాయంత్రం వారిద్దరిని న్యాయమూర్తి ముందు హాజరుపరచగా.. ఇద్దరికి 14 రోజుల రిమాండ్‌ విధించి రెడ్డిపల్లిలోని జిల్లా జైలుకు తరలించాలని పోలీసులు ఆదేశించారు. అయితే ఆ జైలులో ఓ ఖైదీకి కరోనా అనుమానిత లక్షణాలు ఉండటంతో.. వారిద్దరిని అక్కడికి అనుమతి ఇవ్వలేదు. ఇక ఈ విషయాన్ని న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లగా.. తాడిపత్రి జైలుకు తరలించాలని సూచించారు. అయితే అక్కడికి తీసుకెళ్తే శాంతిభద్రతల సమస్య తలెత్తుందని పోలీసులు అభ్యంతరం చెప్పడంతో.. అర్ధరాత్రి వారిని కడప జైలుకు తరలించారు. కాగా జేసీ ట్రావెల్స్‌లో అక్రమాలు జరిగినట్లు రవాణాశాఖ అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్‌ రెడ్డిలపై అనంతపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. హైదరాబాద్‌లోని జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంట్లో వారిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి అనంతపురంకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే.

Read This Story Also: ఆ ఐదుగురు ఆటగాళ్లకు నాడా నోటీసులు… వివరణ ఇచ్చిన బీసీసిఐ