Breaking News
  • ప్రధాని శంకుస్థాపన చేసిన రాజధానిని మార్చే హక్కు ఎవరికీ లేదు. సుప్రీంకోర్టు, రాష్ట్రపతి ఒప్పుకుంటేనే హైకోర్టు కదులుతుంది-కేశినేని. అమరావతి రక్షణకు పార్లమెంటు వేదికగా పోరాటం చేస్తాం-కేశినేని.
  • చిత్తూరు: తిరుచానూరు పీఎస్‌ నుంచి బేడీలతో పరారైన దొంగ. ట్రాక్టర్‌ దొంగతనం కేసులో నాగరాజును అరెస్ట్‌చేసిన పోలీసులు. దొంగ నాగరాజు కోసం గాలిస్తున్న పోలీసులు.
  • ఢిల్లీ: ఆప్‌ ప్రభుత్వంపై బీజేపీ తీవ్ర విమర్శలు. నిర్భయ దోషులను రక్షించేందుకు ఆప్‌ ప్రభుత్వం యత్నిస్తోంది. కావాలనే న్యాయ ప్రక్రియను ఆలస్యం చేస్తోంది-మనోజ్‌ తివారీ. పోలీసులు తమ పరిధిలో లేరని తప్పించుకోవాలని ఆప్‌ చూస్తోంది -బీజేపీ ఢిల్లీ చీఫ్‌ మనోజ్‌ తివారీ.
  • అనంతపురం: తాడిపత్రిలో కత్తిపోట్లు. డబ్బుల విషయంలో స్నేహితుల మధ్య ఘర్షణ. రాము అనే వ్యక్తిని కత్తితో పొడిచిన రవితేజ. ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందిన రాము.
  • రైతులు కన్నీళ్లు పెట్టినా సీఎం మనసు కరగడం లేదు. రాష్ట్రంలో పోలీస్‌ రాజ్యం నడుస్తోంది-దేవినేని ఉమ. విశాఖలో భూదందా నడుస్తోంది-మాజీ మంత్రి దేవినేని ఉమ. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కోసం రాజధానిని విశాఖకు తరలిస్తున్నారు. పులివెందుల పులి డమ్మీ కాన్వాయ్‌తో వెళ్తోంది. దేశ చరిత్రలో డమ్మీ కాన్వాయ్‌తో వెళ్లిన సీఎం చరిత్రలో లేరు. సచివాలయానికి వెళ్లేందుకు మెటల్‌ రోడ్డు వేసుకుంటున్నారు. 5 కోట్ల మంది ప్రజలు రేపు రోడ్లపైకి రావాలి-దేవినేని ఉమ.

ఉద్రిక్తంగా పవన్ కాకినాడ పర్యటన!

Janasena Chief Pawan kalyan tour, ఉద్రిక్తంగా పవన్ కాకినాడ పర్యటన!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడ పర్యటన టెన్షన్ టెన్షన్‌గా మారింది. తాజాగా విశాఖ నుంచి కాకినాడకు చేరుకున్న పవన్.. జనసేన పార్టీ నాయకుడు నానాజీతో ఆయన ఇంటిలో సమావేశమయ్యారు. కాగా.. పవన్ కల్యాణ్ వెంట భారీగా కార్యకర్తలు ఉండటంతో తుని, ప్రత్తిపాడు వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి, ప్రధాన రహదారులను మూసివేశారు పోలీసులు. తునిలో పది వాహనాలను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు రహదారులను మూసి వెయడంతో.. వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక అటు నానాజీ ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించి ఉన్నారు.

కాగా కాకినాడలో ప్రస్తుతం 144 సెక్షన్ అమలవుతోంది. ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఇంటి వద్ద కూడా పోలీసులు గట్టి భద్రతను ఏర్పాటు చేశారు. పవన్‌పై వైసీపీ ఎమ్మెల్యే ద్వారం పూడి చంద్రశేఖర్.. షాకింగ్ కామెంట్స్ చేయడంతో.. ఆదివారం ఆయన ఇంటిని, జనసేన కార్యకర్తలు ముట్టడించారు. ఈ నేపథ్యంలో కాకినాడలో పవన్ పర్యటన ఉద్రిక్త వాతావరణాన్ని నింపింది.