అర్ధరాత్రి కొత్త అధ్యాయం: విడిపోయిన జమ్ము కశ్మీర్

దేశ చరిత్రలో మరో కొత్త అధ్యాయం మొదలైంది. నిన్నటివరకు ఒకే రాష్ట్రంగా ఉన్న జమ్ముకశ్మీర్ నేటి నుంచి రెండు కేంద్ర ప్రాంతాలుగా విడిపోయింది. శాసనసభ కలిగిన కేంద్ర పాలిత రాష్ట్రంగా జమ్ము కశ్మీర్, శాసనసభ లేని కేంద్రపాలిత రాష్ట్రంగా లద్ధాఖ్ ఆవిర్భవించాయి. జమ్ముకశ్మీర్ రాష్ట్రాన్ని విభజిస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఈ ఏడాది ఆగష్టు 9న జారీ చేసిన ఉత్తర్వులు బుధవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో దేశంలో రాష్ట్రాల సంఖ్య 28కు తగ్గగా.. […]

అర్ధరాత్రి కొత్త అధ్యాయం: విడిపోయిన జమ్ము కశ్మీర్
Follow us

| Edited By:

Updated on: Oct 31, 2019 | 9:56 AM

దేశ చరిత్రలో మరో కొత్త అధ్యాయం మొదలైంది. నిన్నటివరకు ఒకే రాష్ట్రంగా ఉన్న జమ్ముకశ్మీర్ నేటి నుంచి రెండు కేంద్ర ప్రాంతాలుగా విడిపోయింది. శాసనసభ కలిగిన కేంద్ర పాలిత రాష్ట్రంగా జమ్ము కశ్మీర్, శాసనసభ లేని కేంద్రపాలిత రాష్ట్రంగా లద్ధాఖ్ ఆవిర్భవించాయి. జమ్ముకశ్మీర్ రాష్ట్రాన్ని విభజిస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఈ ఏడాది ఆగష్టు 9న జారీ చేసిన ఉత్తర్వులు బుధవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో దేశంలో రాష్ట్రాల సంఖ్య 28కు తగ్గగా.. కేంద్ర పాలిత ప్రాంతాల సంఖ్య ఏడుకు పెరిగింది. అలాగే జమ్ముకశ్మీర్ తొలి లెఫ్టినెంట్ గవర్నర్‌గా జీసీ ముర్ము.. లద్ధాఖ్ గవర్నర్‌గా రాధాకృష్ణ మాథుర్ బాధ్యతలు చేపట్టనున్నారు. సర్దార్ వల్లభాయి పటేల్ జయంతి రోజునే జమ్ముకశ్మీర్ రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా ఆవిర్భవించడం విశేషం.

కాగా లోక్‌సభ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చిన తరువాత జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక హోదానిచ్చే ఆర్టికల్ 370, ఆర్టికల్ 35ఏ రద్దుపై కసరత్తులు చేసింది. ఈ క్రమంలో తొలి లోక్‌సభ సమావేశాల్లో(ఆగష్టు 5న) ఆ ఆర్టికల్స్‌ను రద్దు చేస్తూ.. జమ్ముకశ్మీర్‌ను విభజిస్తున్నట్లు ప్రకటించింది. ఆ వెంటనే ఆ రాష్ట్రంలో పలు నిషేదాఙ్ఞలు అమలు చేశారు. మాజీ ముఖ్యమంత్రులతో సహా పలువురిని గృహ నిర్భందంలో ఉంచారు. విపక్షనేతలు అక్కడికి వెళ్లకుండా ఆంక్షలు విధించారు. ఇంటర్నెట్, మొబైల్ ఫోన్ సర్వీసులను తాత్కాలికంగా సస్పెండ్ చేశారు. ఆ తరువాత నిషేధాఙ్ఞలను తొలగిస్తూ వచ్చిన విషయం తెలిసిందే.

ఇదిలా ఉంటే రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విడిపోయిన తరువాత జమ్ముకశ్మీర్‌లోని శాంతి భద్రతలన్నీ నేరుగా కేంద్రం చేతుల్లోకి వెళ్లనున్నాయి. పోలీసు యంత్రాంగం కూడా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆధీనంలోనే ఉంటుంది. లెఫ్టినెంట్ గవర్నర్‌కే సర్వాధికారాలు ఉండనుండగా.. భూ లావాదేవీల వ్యవహారాలు ప్రభుత్వ ఆధీనంలోనే ఉండనున్నాయి. ఇక ఢిల్లీ తరమాలోనే జమ్ముకశ్మీర్‌కూ అసెంబ్లీ ఉండనుండగా.. శాంతి భద్రతలు, పోలీసు యంత్రాంగం, పబ్లిక్‌ ఆర్డర్‌ మినహా మిగిలిన అన్ని అంశాల్లోనూ చట్టాలు చేసే అధికారాలున్నాయి. మరోవైపు లద్ధాఖ్‌కే శాసనసభ లేకపోగా.. ఇది కూడా పూర్తిగా కేంద్ర నియంత్రణలోనే ఉంటుంది.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు