Breaking News
  • అసెంబ్లీ సాక్షిగా ఐదు కోట్ల ఆంధ్రులను మోసం చేశారు. న్యాయం చేయమని రోడ్డుపైకి వచ్చిన మహిళను అరెస్ట్ చేస్తున్నారు. మహిళలపై లాఠీచార్జ్‌ దారుణం-నారా లోకేష్‌. మండలిలో రేపు ఏం జరుగుతుందో ప్రజలే చూస్తారు-లోకేష్‌.
  • బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా ఎన్నిక సంతోషకరం. తెలంగాణ తరపున అభినందనలు తెలిపాం. తెలంగాణపై దృష్టిపెట్టాలని కోరాం-టీఎస్‌ బీజేపీ చీఫ్‌ డా.లక్ష్మణ్‌. త్వరలో తెలంగాణలో జేపీ నడ్డా పర్యటిస్తారు. కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌, మజ్లిస్‌ ఒక గూటి పక్షులే-డా.లక్ష్మణ్‌.
  • అమరావతి: పవన్‌తో పోలీసుల మంతనాలు. రాజధాని గ్రామాల పర్యటన వాయిదా వేసుకోవాలంటున్న పోలీసులు.
  • కరీంనగర్‌లో గంజాయి ముఠా గుట్టురట్టు. రూ.30 లక్షల విలువైన గంజాయి పట్టివేత. ముగ్గురు అరెస్ట్‌, ట్రక్‌ స్వాధీనం.
  • చెన్నై విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత. అబుదాబి నుంచి చెన్నైకి తరలిస్తున్న 3.7 కేజీల బంగారం పట్టివేత. ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న కస్టమ్స్ అధికారులు.

ఆ పదవి కోసం.. తన బయోడేటాను పంపిన జగ్గారెడ్డి..

Jagga Reddy enters TPCC chief race, ఆ పదవి కోసం.. తన బయోడేటాను పంపిన జగ్గారెడ్డి..

కాంగ్రెస్‌ పార్టీలో మళ్లీ టీపీసీసీ పదవికోసం ఫైట్ స్టార్ట్ అయ్యింది. ఇప్పటి వరకు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రేవంత్ రెడ్డి, భట్టివిక్రమార్క మాత్రమే ఈ పదవి కోసం పోటీలో ఉన్నారనుకుంటే.. తాజాగా వీరికి పోటీగా సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా ఎంటర్ అయ్యారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తెలిపారు. గురువారం సీఎల్పీ కార్యాలయంలో జరిగిన చిట్‌చాట్‌లో తన మనసులో ఉన్న మాటను బయటపెట్టారు. అంతేకాదు కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి తన బయోడేటా కూడా పంపించినట్లు జగ్గారెడ్డి తెలిపారు. ప్రస్తుతం ఉన్న టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి వైదొలిగిన తర్వాత..  ఆ పదవిని తనకు ఇవ్వాలని ఏఐసీసీకి విన్నవించుకున్నట్లు వెల్లడించారు.

ఈ నెల 16వ తేదీ శనివారం ఢిల్లీలో ఏఐసీసీ కీలక సమావేశం ఉందని.. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ పెద్దలకు తన బయోడేటాను పంపినట్లు తెలిపారు. ఆ బయోడేటాలో జగ్గారెడ్డి తన పూర్తి వివరాలను వెల్లడించారని తెలుస్తోంది. తన కుటుంబ వివరాలతో పాటుగా.. ఆయనపై ఉన్న కేసుల విషయం కూడా ఆ బయోడేటాలో పొందుపరిచారు. 14 రోజులు జైలు జీవితం గడిపిన విషయాన్ని కూడా అందులో పేర్కొన్నారు. ఈ బయోడేటా కాపీలను కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో పాటు పలువురికి పంపించినట్లు తెలిపారు.

త్వరలోనే పార్టీ అధినేతలను కలిసి.. టీపీసీసీ పదవి గురించి చర్చిస్తానని.. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్‌ను తిరిగి అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తానన్నారు. అందుకోసం తనవద్ద అద్భుతమైన మెడిసిన్ ఉందంటూ చెప్పుకొచ్చారు. సమయం వచ్చినప్పుడు దాన్ని బయటకు తీసి ఉపయోగిస్తానని వ్యాఖ్యనించారు. కాగా, టీ పీసీసీ చీఫ్ పదవికోసం.. పార్టీలో టఫ్ ఫైట్ ఉన్న విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో ఉత్తమ్ సతీమణి ఓటమి పాలయ్యారు. అయితే ఆ తర్వాత టీ పీసీసీ పదవి మార్చాలన్న డిమాండ్‌ బలంగా వినిపిస్తోంది. దీంతో అటు అధిష్టానం కూడా టీపీసీసీ పదవి విషయంలో ఉత్తమ్‌కు ఉద్వాసన పలికి.. కొత్త వారిని నియమించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.