Breaking News
  • ప్రజలు ఘోరంగా తిరస్కరించినా చంద్రబాబుకు బుద్ధి రాలేదు. కష్టకాలంలో కూడా చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారు-అంబటి. రాష్ట్ర ఖజానా నుంచే రూ.1000 ఇచ్చాం. దీనిపై కూడా చంద్రబాబు ఆరోపణలు చేస్తున్నారు-అంబటి. ఇలాంటి సమయంలో ప్రజలకు అండగా ఉండాల్సింది పోయి.. ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తున్నారు-వైసీపీ నేత అంబటి.
  • పశ్చిమ బెంగాల్‌లో మందుబాబులకు గుడ్‌ న్యూస్‌. పశ్చిమ బెంగాల్‌లో మ.2 గంటల నుంచి సా.5 గంటల వరకు.. మద్యం పంపిణీకి అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం. ఉ.11 నుంచి మ.2 గంటల వరకు బార్ల నుంచి అర్డర్లు. మ.2 గంటల నుంచి పోలీసుల ద్వారా పంపిణీకి అనుమతి.
  • ప్రకాశం: ఒంగోలులో మరో మూడు పాజిటివ్‌ కేసులు. ప్రకాశం జిల్లాలో 27కు చేరిన కరోనా పాజిటివ్‌ కేసులు.
  • తూ.గో: సామర్లకోటలో మట్టి తవ్వకాలను అడ్డుకున్న చినరాజప్ప. మట్టి మాఫియా చెలరేగిపోతోంది-ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప. మట్టి అక్రమ తవ్వకాలపై కలెక్టర్‌తో మాట్లాడా. పెద్దపులి చెరువులో మట్టి తవ్వకాలకు ఎలాంటి అనుమతులు లేవని.. అక్రమ తవ్వకాలపై విచారణ జరిపిస్తామని కలెక్టర్‌ తెలిపారు-చినరాజప్ప.
  • తమిళనాడులో వేగంగా విస్తరిస్తోన్న కరోనా మహమ్మారి. ఈ రోజు తమిళనాడులో 48 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు. ఇప్పటి వరకు తమిళనాడులో 738 కరోనా కేసులు నమోదు.

కర్ణాటక మంత్రి ఇంటిపై ఐటీ దాడులు

IT Raids, కర్ణాటక మంత్రి ఇంటిపై ఐటీ దాడులు

కర్ణాటకలో అధికార పార్టీ నేతలపై ఐటీ దాడులు కలకలం సృష్టిస్తున్నాయి. ఆ రాష్ట్ర మైనర్ ఇరిగేషన్ శాఖ మంత్రి సీఎస్ పుట్టరాజు నివాసంలో గురువారం ఐటీ అధికారులు దాడులు చేశారు. ఉదయం 5గంటలకు పుట్టరాజు స్వగ్రామం చినకురులికి చేరుకున్న ఐటీ అధికారులు అక్కడ సోదాలు నిర్వహించారు. అలాగే మాండ్యాలో పుట్టరాజుకు సంబంధించిన ఆస్తులపైనా, మైసూరులో ఆయన బంధువు ఇంటిలోనూ సోదాలు జరుగుతున్నాయి.

కాగా ఈ దాడులను పుట్టరాజు ధృవీకరించారు. తన ఇంట్లో సోదాలు జరిగాయని ఆయన అన్నారు. ‘‘10కోట్ల ఆస్తికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు నా దగ్గర ఉన్నాయి. ఈ దాడులకు నేనేం భయపడను. ఈ దాడుల వెనుక ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నారు’’ అంటూ ఆయన ఆరోపించారు. కాగా జేడీఎస్ పార్టీతో అనుబంధం ఉన్న వ్యాపార‌వేత్త‌లు, నేత‌ల‌పైనా ఐటీ దాడులు జరుగుతున్నాయి. సుమారు 20 ప్రాంతాల్లో ఐటీశాఖ త‌నిఖీలు చేస్తోంది. సీఎం సోద‌రుడు, మంత్రి రేవ‌ణ్ణ అనుచరుల ఇండ్ల‌లోనూ ఐటీ సోదాలు జ‌రుగుతున్నాయి..

Related Tags