మరోసారి రెపరెపలాడిన మువ్వన్నెల జెండా.. పీఎస్​ఎల్​వీ-సీ 47 విజయవంతం

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో..ఇటీవల చేసిన చంద్రయాన్ -2 జస్ట్ మిస్ అయిన సంగతి తెలిసిందే. అయినప్పటికి  ఏ మాత్రం వెనకడుగులు వెయ్యడం లేదు. తాజాగా ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోన్న.. పీఎస్​ఎల్​వీ -సీ 47 నింగిలోకి దూసుకుపోయింది.  నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ రెండో ప్రయోగ సెంటర్‌ నుంచి ఈ ప్రయోగాన్ని నిర్వహించారు. దీంతో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఖాతాలో మరో చిరస్మరణీయమైన విజయం జమైంది. ఈ ఉపగ్రహం తయారీకి […]

మరోసారి రెపరెపలాడిన మువ్వన్నెల జెండా.. పీఎస్​ఎల్​వీ-సీ 47 విజయవంతం
Follow us

|

Updated on: Nov 27, 2019 | 10:51 AM

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో..ఇటీవల చేసిన చంద్రయాన్ -2 జస్ట్ మిస్ అయిన సంగతి తెలిసిందే. అయినప్పటికి  ఏ మాత్రం వెనకడుగులు వెయ్యడం లేదు. తాజాగా ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోన్న.. పీఎస్​ఎల్​వీ -సీ 47 నింగిలోకి దూసుకుపోయింది.  నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ రెండో ప్రయోగ సెంటర్‌ నుంచి ఈ ప్రయోగాన్ని నిర్వహించారు. దీంతో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఖాతాలో మరో చిరస్మరణీయమైన విజయం జమైంది. ఈ ఉపగ్రహం తయారీకి ఇస్రో కేవలం రూ.350 కోట్లు ఖర్చు చేయడం విశేషం. ఈ రోజు ఉదయం 9 గంటల 28 నిమిషాలకు కార్టోశాట్-3 శాటిలైట్ అంతరిక్షం దిశగా తన ప్రయాణాన్ని ప్రారంభించింది. అనంతరం వివిధ దశల్లో కేవలం 26.50 నిమిషాల వ్యవధిలో శాటిలైట్స్‌ను నిర్దేశిత కక్ష్యలో ఇది ప్రవేశపెట్టింది. 16 వందల 25 కిలోల కార్టోశాట్​తో కలిపి మొత్తం 14 ఉపగ్రహాల్ని పీఎస్​ఎల్​వీ -సీ 47 అంతరిక్షంలోకి తీసుకెళ్లింది.

పీఎస్​ఎల్​వీ -సీ 47  రాకెట్‌ ద్వారా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన కార్టోశాట్‌- 3 తో పాటు అమెరికాకు చెందిన మరో 13 నానో సాటిలైట్లను కూడా నింగిలోకి పంపారు. కార్టోశాట్ కాలపరిమితి ఐదేళ్లు. కార్టో శాట్-3ని భూమి నుంచి 509 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న సింక్రోనస్‌ ఆర్బిట్‌లోకి ప్రవేశపెట్టారు సైంటిస్టులు. ఇస్రో సరిహద్దుల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేయడానికి ఇమేజింగ్‌ వ్యవస్థలున్న కార్టోశాట్‌-3ని ప్రయోగించింది. పాకిస్తాన్‌ భూభాగంలోని ఉగ్ర స్థావరాలపై మెరుపుదాడులకు సహకరించిన రిశాట్‌ శ్రేణికి మించిన సామర్థ్యం ఈ ఉపగ్రహాలకు ఉన్నట్లు ఇస్రో తెలిపింది. మూడో తరం ఉపగ్రహంగా భావిస్తున్న కార్టోశాట్‌-3, 25 సెంటిమీటర్ల హై రిజల్యూషన్‌తో ఫోటోలను తీయగలదు. శత్రుదేశాల కదలికలను అతి దగ్గరగా ఫోటోలు తీసి భూమికి చేరవేస్తుంది. సైనిక, ఉగ్రవాద స్థావరాలను మరింత స్పష్టంగా చూపగలదు. దీంతో పాటు భూ ఉపరితలంపై పరిశోధన జరపడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇస్రో విజయవంతంగా రాకెట్‌ను ప్రయోగించిందని తెలిపారు ఇస్రో ఛైర్మన్‌ శివన్‌. ఈ అద్భుతమైన రాకెట్‌ ప్రయోగంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. మార్చి వరకు తమకు 13 మిషన్లు ఉన్నాయని… ఇస్రోకి తగినంత పని ఉందని చెప్పుకొచ్చారు.