9మంది భారత నావికులను విడుదల చేసిన ఇరాన్

తమ దేశంలో ఆధీనంలో ఉన్న తొమ్మిది మంది భారత నావికులను ఇరాన్ విడుదల చేసింది. ఈ నెల ఆరంభంలో ఎమ్‌టీ రియా అనే నావను అదుపులోకి తీసుకున్న ఇరాన్.. అందులో ఉన్న 12మంది సిబ్బందిని అరెస్ట్ చేసింది. తాజాగా వారిలోని తొమ్మిది మందిని విడుదల చేసింది. మరో ముగ్గురు ఇంకా వారి చెరలోనే ఉన్నారు. మరోవైపు ఇటీవల అదుపులోకి తీసుకున్న బ్రిటన్ నౌక స్టెనా ఇంపెరోలోనూ 18మంది భారతీయులు ఉన్నారు. అయితే అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రికత్తలు […]

9మంది భారత నావికులను విడుదల చేసిన ఇరాన్
Follow us

| Edited By:

Updated on: Jul 26, 2019 | 12:37 PM

తమ దేశంలో ఆధీనంలో ఉన్న తొమ్మిది మంది భారత నావికులను ఇరాన్ విడుదల చేసింది. ఈ నెల ఆరంభంలో ఎమ్‌టీ రియా అనే నావను అదుపులోకి తీసుకున్న ఇరాన్.. అందులో ఉన్న 12మంది సిబ్బందిని అరెస్ట్ చేసింది. తాజాగా వారిలోని తొమ్మిది మందిని విడుదల చేసింది. మరో ముగ్గురు ఇంకా వారి చెరలోనే ఉన్నారు. మరోవైపు ఇటీవల అదుపులోకి తీసుకున్న బ్రిటన్ నౌక స్టెనా ఇంపెరోలోనూ 18మంది భారతీయులు ఉన్నారు. అయితే అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రికత్తలు పెరగడంతో ఇరాన్ పలు నావలను ఉల్లంఘనల పేరిట అదుపులోకి తీసుకుంటోంది. దీంతో అనేక మంది భారతీయులు వారి అదుపులోకి వెళ్లారు.

దీంతో పాటు గ్రేస్-1 నావలో ప్రయాణిస్తున్న 24మంది భారత నావికులను బ్రిటన్‌ ఆధీనంలో ఉన్న జీబ్రాల్టర్ పోలీస్ అధారిటీస్ అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో వారిని లండన్‌లోని భారత రాయబారులు బుధవారం కలిశారని విదేశాంగ శాఖ గురువారం ప్రకటించింది. వారిని విడుదల చేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని విదేశాంగ అధికార ప్రతినిధి రవీష్ కుమార్ భరోసా ఇచ్చారు.

పెరుగులో బెల్లం వేసుకుని తింటే.. ఏమవుతుందో తెలుసా..?
పెరుగులో బెల్లం వేసుకుని తింటే.. ఏమవుతుందో తెలుసా..?
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..
బేకరీ డెజర్ట్స్ ను ఎక్కువగా తింటున్నారా.. పేగుల ఆరోగ్యం జాగ్రత్త
బేకరీ డెజర్ట్స్ ను ఎక్కువగా తింటున్నారా.. పేగుల ఆరోగ్యం జాగ్రత్త
తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!
తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!
డీజే టిల్లు సాంగ్‌కు కోహ్లీ హుషారైన స్టెప్పులు.. వీడియో చూశారా?
డీజే టిల్లు సాంగ్‌కు కోహ్లీ హుషారైన స్టెప్పులు.. వీడియో చూశారా?
ఏపీలో పొన్నవోలు వర్సెస్ వైఎస్ షర్మిల..
ఏపీలో పొన్నవోలు వర్సెస్ వైఎస్ షర్మిల..
ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు వేసుకుని తాగితే..
ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు వేసుకుని తాగితే..
జాతకంలో శని దోషమా, ఏలినాటి శని ప్రభావమా.. రెమిడీస్ మీ కోసం
జాతకంలో శని దోషమా, ఏలినాటి శని ప్రభావమా.. రెమిడీస్ మీ కోసం
చిక్కుల్లో ప్రముఖ నిర్మాత.. ఆత్మహత్యాయత్నం చేసిన పనిమనిషి..
చిక్కుల్లో ప్రముఖ నిర్మాత.. ఆత్మహత్యాయత్నం చేసిన పనిమనిషి..
చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?
చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?