IPL 2020, SRH vs KKR.. కోల్‌కతా ముందు చిన్న టార్గెట్

|

Sep 26, 2020 | 10:08 PM

ఐపీఎల్ 2020 సీజన్‌ను ఓటములతో ప్రారంభించిన సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్లు ఢీ అంటే ఢీ అంటున్నాయి. కోల్‌కతాతో తలపడుతున్న రెండో టీ20లో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న హైదరాబాద్‌ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 142 పరుగులు చేసింది. దీంతో కోల్‌కతా నైట్‌రైడర్స్ ముందు హైదరాబాద్‌ భారీ టార్గ్‌ను పెట్టలేకపోయింది. 20 ఓవర్లకు హైదరాబాద్‌ నాలుగు వికెట్లు కోల్పోయి 142 పరుగులు చేసింది. మనీష్‌ పాండే(51) ఆఫ్ సెంచరీ చేయగా.. వార్నర్‌(36), […]

IPL 2020, SRH vs KKR.. కోల్‌కతా ముందు చిన్న టార్గెట్
Follow us on

ఐపీఎల్ 2020 సీజన్‌ను ఓటములతో ప్రారంభించిన సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్లు ఢీ అంటే ఢీ అంటున్నాయి. కోల్‌కతాతో తలపడుతున్న రెండో టీ20లో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న హైదరాబాద్‌ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 142 పరుగులు చేసింది. దీంతో కోల్‌కతా నైట్‌రైడర్స్ ముందు హైదరాబాద్‌ భారీ టార్గ్‌ను పెట్టలేకపోయింది.

20 ఓవర్లకు హైదరాబాద్‌ నాలుగు వికెట్లు కోల్పోయి 142 పరుగులు చేసింది. మనీష్‌ పాండే(51) ఆఫ్ సెంచరీ చేయగా.. వార్నర్‌(36), సాహా(30) ఫర్వాలేదనిపించారు. కాగా, రసెల్‌ వేసిన చివరి ఓవర్‌లో సాహా రనౌటవ్వగా 9 పరుగులు వచ్చాయి.

ఆండ్రూ రసెల్‌ వేసిన 18వ ఓవర్‌ నాలుగో బంతికి మనీష్‌ పాండే(51) అనూహ్య రీతిలో ఔటయ్యాడు.   ఫుల్‌టాస్ బాల్‌ పడడంతో మనీష్‌ షాట్‌ ఆడబోగా అది అక్కడే గాల్లోకి ఎగిరింది. దీంతో రసెల్‌ వెంటనే క్యాచ్‌ పట్టుకున్నాడు.

ఇక శనివారం కోల్‌కతాపై నెగ్గి లీగ్‌లో బోణీ చేయాలని భావిస్తున్నది. అబుదాబిలోని షేక్‌ జాయెద్‌ క్రికెట్‌ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో పోటీ పడుతున్న ఈ రెండు జట్లు టోర్నీలో బోణీ కొట్టాలని ఉవ్విళ్లురుతున్నాయి.