హిట్‌మ్యాన్‌ ఉంటే.. కప్ గెలిచినట్లే..

ఐపీఎల్‌ 2020 విజేతగా ముంబై ఇండియన్స్ అవతరించిన సంగతి తెలిసిందే. దీనితో రోహిత్ శర్మ ఐపీఎల్‌లో తన రికార్డును కొనసాగించాడు.

హిట్‌మ్యాన్‌ ఉంటే.. కప్ గెలిచినట్లే..

Updated on: Nov 11, 2020 | 10:04 PM

Mumbai Indians IPL 2020: ఐపీఎల్‌ 2020 విజేతగా ముంబై ఇండియన్స్ అవతరించిన సంగతి తెలిసిందే. దీనితో రోహిత్ శర్మ ఐపీఎల్‌లో తన రికార్డును కొనసాగించాడు. ఇప్పటిదాకా ఆరుసార్లు ఐపీఎల్ ఫైనల్ ఆడిన హిట్‌మ్యాన్‌.. ప్రతీసారి కప్పును ముద్దాడాడు. 2009లో డెక్కన్ ఛార్జర్స్ తరపున విన్నింగ్ టీంలో ఉన్న రోహిత్ శర్మ.. ముంబై జట్టుకు సారధిగా వ్యవహరించి 2013, 2015, 2017,2019, 2020 సీజన్లలో టైటిల్ విజేతగా నిలిపాడు. గాయంతో లీగ్‌ స్టేజిలో పలు మ్యాచ్‌లకు దూరమైన రోహిత్ శర్మ.. ఫైనల్‌లో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి జట్టును గెలిపించాడు. టీంలో రోహిత్ శర్మ ఉంటే కచ్చితంగా కప్పు గెలిచినట్లేనని మరోసారి నిరూపించుకున్నాడు.

Loading...
Unable to load recommendations.
Follow Us