రిక్కీ మాటలకు పంత్‌ ఎక్స్‌ప్రెషన్స్‌.. నవ్వులు పూయిస్తోన్న వీడియో

ఐపీఎల్‌లో భాగంగా శనివారం చెన్నై సూపర్‌ కింగ్స్‌, ఢిల్లీ కేపిటల్స్ మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఇందులో ఢిల్లీ కేపిటల్స్ విజయం సాధించారు.

రిక్కీ మాటలకు పంత్‌ ఎక్స్‌ప్రెషన్స్‌.. నవ్వులు పూయిస్తోన్న వీడియో

Edited By:

Updated on: Oct 18, 2020 | 2:33 PM

Rishabh Pant Ricky Ponting: ఐపీఎల్‌లో భాగంగా శనివారం చెన్నై సూపర్‌ కింగ్స్‌, ఢిల్లీ కేపిటల్స్ మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఇందులో ఢిల్లీ కేపిటల్స్ విజయం సాధించారు. అయితే గాయం వలన ఈ మ్యాచ్‌లో రిషబ్‌ పంత్ ఆడలేదు. కాగా ఈ మ్యాచ్ జరిగే సమయంలో ఢిల్లీ కేపిటల్స్ కోచ్‌ రిక్కీ పాంటింగ్ లైవ్‌ ఇంటర్వ్యూని ఇచ్చారు. ఆ సమయంలో వెనుకాల నుంచి వచ్చిన రిషబ్ పంత్‌.. పాంటింగ్‌ మాటలకు ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చాడు. ఆ తరువాత మార్క్‌ నికోలస్ వెనుక చూడాలంటూ పాంటింగ్‌కి చెప్పగా.. అక్కడ పంత్‌ని చూసి నవ్వేశాడు. రిషబ్‌ కూడా అక్కడి నుంచి నవ్వుతూ వెళ్లిపోయాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. రిషబ్‌ ఎక్స్‌ప్రెషన్స్‌ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. దీంతో పంత్ నువ్వు బెస్ట్ ఎంటర్‌టైనర్‌వి అంటూ‌ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Read More:

ఆ హిట్‌ మూవీ రీమేక్‌లో మోహన్ బాబు..!

ఇటలీకి వెళ్లనున్న ‘రంగ్‌ దే’ టీమ్‌..!

https://twitter.com/Gautamgaduu/status/1317506095787569154

Follow Us