వినయ్‌కుమార్‌ రికార్డును బ్రేక్‌ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్‌ బౌలర్‌ రబాడ

|

Oct 10, 2020 | 1:26 PM

పేస్‌ బౌలర్‌ కగిసో రబాడ తెలుసుకదా! ఈ సౌతాఫ్రికా క్రికెటర్‌ ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లో జరుగుతున్న ఈ మెగా టోర్నమెంట్‌లో రబాడ దుమ్ము రేపుతున్నాడు..

వినయ్‌కుమార్‌ రికార్డును బ్రేక్‌ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్‌ బౌలర్‌ రబాడ
Follow us on

పేస్‌ బౌలర్‌ కగిసో రబాడ తెలుసుకదా! ఈ సౌతాఫ్రికా క్రికెటర్‌ ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లో జరుగుతున్న ఈ మెగా టోర్నమెంట్‌లో రబాడ దుమ్ము రేపుతున్నాడు.. మిసైల్స్‌ వంటి బాల్స్‌తో ప్రత్యర్థులను ముప్పుతిప్పలు పెడుతున్నాడు.. ఢిల్లీ వరుస విజయాలలో రబాడదే కీలకపాత్ర.. ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌లు ఆడిన ఢిల్లీ క్యాపిటల్స్‌ అయిదు మ్యాచులలో విజయం సాధించి పాయింట్ల పట్టికలో టాప్‌ప్లేస్‌లో నిలిచింది. నిన్న రాజస్తాన్‌ రాయల్స్‌పై ఢిల్లీ 46 పరుగుల తేడాతో గెలుపొంది దూసుకెళుతోంది.. ఇందులో రబాడ మూడు వికెట్లు తీసుకున్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు అన్ని మ్యాచ్‌లు ఆడిన కగిసో రబాడ 15 వికెట్లు తీసుకున్నాడు. ఈ సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసుకున్నది కూడా రబాడనే! అంతేకాదు.. రబాడ మరో రికార్డు కూడా సృష్టించాడు.. 2017 నుంచి ఇప్పటి వరకు వరుసగా 20 మ్యాచ్‌లలో వికెట్లు తీస్తూనే ఉన్నాడు.. వికెట్‌లెస్‌గా ఏ మ్యాచ్‌లోనూ వెనుదిరిగింది లేదు.. ఇంతకుముందు వినయ్‌కుమార్‌ వరుసగా 19 ఇన్నింగ్స్‌లలో వికెట్లను సాధించాడు.. ఇలాంటి ఫీట్‌ సాధించినవారిలో అగ్రగణ్యుడు చెన్నై ఆల్‌రౌండర్‌ డ్వేన్‌ బ్రావో.. ఇతడు 2012 నుంచి 2015 వరకు వరుసగా 27 మ్యాచ్‌లలో వికెట్లు తీసుకున్నాడు.. ముంబాయి ఇండియన్స్‌ తరుపున ఆడుతున్న శ్రీలంక ఆటగాడు లసిత్‌ మలింగ 2015-2017 సీజన్ల మధ్య 17 మ్యాచ్‌లలో వికెట్లు తీసుకున్నాడు. ఈ సీజన్‌లో మరో ఎనిమిది మ్యాచ్‌లలో రబాడ వికెట్లు తీయగలిగితే బ్రావో రికార్డు చెరిగిపోతుంది. ప్రస్తుతం రబాడ ఫామ్‌ను చూస్తే ఆ అవకాశాలు బాగానే ఉన్నాయనిపిస్తోంది.