కీలక మ్యాచ్‌కు ముందే.. హైదరాబాద్‌కు గట్టి షాక్.!

ఐపీఎల్‌ 13వ సీజన్ లీగ్ చివరి మ్యాచ్‌లు రసవత్తరంగా సాగుతున్నాయి. ప్లేఆఫ్స్ మూడు స్థానాల కోసం ఏకంగా ఆరు జట్లు పోటీ పడుతున్నాయి.

కీలక మ్యాచ్‌కు ముందే.. హైదరాబాద్‌కు గట్టి షాక్.!

Edited By:

Updated on: Oct 31, 2020 | 6:33 PM

IPL 2020: ఐపీఎల్‌ 13వ సీజన్ లీగ్ చివరి మ్యాచ్‌లు రసవత్తరంగా సాగుతున్నాయి. ప్లేఆఫ్స్ మూడు స్థానాల కోసం ఏకంగా ఆరు జట్లు పోటీ పడుతున్నాయి. ఈ తరుణంలో ఇవాళ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగే మ్యాచ్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఎంతో కీలకం కానుంది. ఈ మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ గెలిస్తేనే ప్లేఆఫ్స్ అవకాశాలు సజీవంగా ఉంటాయి.

అయితే ఆర్సీబీతో మ్యాచ్‌కు ముందే హైదరాబాద్‌కు గట్టి షాక్ తగిలింది.  గాయం కారణంగా ఆల్‌రౌండర్ విజయ్ శంకర్ ఐపీఎల్ నుంచి వైదొలిగినట్లు ఓ జాతీయ మీడియా కథనాన్ని ప్రచురించింది. కాగా, మంగళవారం ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో విజయ్ శంకర్ ఎడమ కాలి తొడ కండరానికి గాయం కావడంతో మైదానాన్ని వీడిన సంగతి విదితమే. కాగా, కీలక సమయంలో విజయ్ శంకర్ దూరం కావడంతో హైదరాబాద్‌కు గట్టి ఎదురుదెబ్బ అని చెప్పాలి.

Also Read: ఏపీ: ఆరోగ్య మిత్ర పోస్టుల భర్తీకి ఉత్తర్వులు.. వివరాలివే..