IPL 2020: ఐపీఎల్-13వ సీజన్‌లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 165 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. తొలి ఓవర్‌లోనే హైదరాబాద్ బెయిర్‌స్టో వికెట్‌ను కోల్పోయినప్పటికీ.. కెప్టెన్ వార్నర్(28), మనీష్ పాండే(29) స్కోర్ బోర్డును ముందుకు నడిపించారు.
ఆ తర్వాత వీరిద్దరూ వెంటవెంటనే పెవిలియన్ చేరడం.. విలియమ్సన్(9) కూడా తక్కువ పరుగులకే ఔట్ కావడంతో హైదరాబాద్ 120 పరుగుల స్కోర్ దాటగలదా అని అనిపించింది. అయితే చివర్లో అభిషేక్ శర్మ(31), ప్రియమ్ గార్గ్(51) మెరుపులు మెరిపించడంతో సన్‌రైజర్స్ గౌరవప్రదమైన స్కోర్ చేయగలిగింది. 20 ఓవర్లకు సన్‌రైజర్స్ హైదరాబాద్ 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. చెన్నై బౌలర్లలో చాహర్ రెండు వికెట్లు, చావ్లా, ఠాకూర్ చెరో వికెట్ తీశారు.
FIFTY!
Maiden half-century in the IPL for the 19-year old Priyam Garg. Way to go ??#Dream11IPL #CSKvSRH pic.twitter.com/xaNqmLz2tn
— IndianPremierLeague (@IPL) October 2, 2020