ఐపీఎల్ 2020: రాణించిన కోహ్లీ.. పంజాబ్ టార్గెట్ 172

ఐపీఎల్ 13వ సీజన్‌లో భాగంగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో బెంగళూరు 172 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ(48)

  • Updated On - 9:18 pm, Thu, 15 October 20
ఐపీఎల్ 2020: రాణించిన కోహ్లీ.. పంజాబ్ టార్గెట్ 172

IPL 2020: ఐపీఎల్ 13వ సీజన్‌లో భాగంగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో బెంగళూరు 172 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ(48) రాణించడంతో పాటు మోరిస్(25) చివర్లో మెరుపులు మెరిపించడంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గౌరవప్రదమైన స్కోర్ సాధించగలిగింది. ఈ మ్యాచ్‌లో బెంగళూరు టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది.

బెంగళూరు ఇన్నింగ్స్‌ దూకుడుగా ప్రారంభమైంది. అయితే ఓపెనర్లు ఫించ్(20), పడిక్కల్(18) వెంటవెంటనే పెవిలియన్ చేరడంతో ఆర్సీబీ స్కోర్ బోర్డు నెమ్మదించింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ(48) ఒక ఎండ్ నుంచి క్రీజులో నిలదొక్కుకుంటున్నా.. మరో ఎండ్‌లో బ్యాట్స్‌మెన్‌ వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఇక చివరి ఓవర్‌లో మోరిస్ మెరుపులు మెరిపించడంతో బెంగళూరు నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. పంజాబ్ బౌలర్లలో షమీ, మురుగన్ అశ్విన్ చెరో రెండు వికెట్లు తీశారు.