ఏడేళ్ల కల.. కోహ్లి గురి కుదిరిందా..?

జట్టులో మంచి, మంచి ప్లేయర్స్ ఉన్నప్పటికీ  ఐపీఎల్ చరిత్రలో ఇప్పటి వరకూ ట్రోఫీ గెలవలేదు రాయల్స్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టు. 

ఏడేళ్ల కల.. కోహ్లి గురి కుదిరిందా..?
Follow us

|

Updated on: Sep 18, 2020 | 7:11 PM

జట్టులో మంచి, మంచి ప్లేయర్స్ ఉన్నప్పటికీ  ఐపీఎల్ చరిత్రలో ఇప్పటి వరకూ ట్రోఫీ గెలవలేదు రాయల్స్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టు.   కోహ్లి లాంటి స్టార్ కెప్టెన్, ఏబీ డివిలియర్స్ లాంటి విధ్వంసకర బ్యాట్స్‌మెన్ ఉన్నా ఆ జట్టుకు కప్ గెలవడం కలగానే మిగిలిపోయింది. కోహ్లి, ఏబీడీ చెలరేగితే… విజయం దాటిపోదు. కానీ ఇద్దరూ నిలవకపోతే మాత్రం.. బెంగళూరు జట్టును నిలబెట్టేవాళ్లు కరువవుతున్నారు. ఆరోన్ ఫించ్ రూపంలో ఓ సూపర్ హిట్టర్ అందుబాటులో ఉండటం ఆర్సీబీకి ఊరటనిచ్చే అంశం. ఇంతకు ముందు సీజన్లలో ఆర్సీబీ బౌలింగ్‌ విభాగం కాస్త వీక్ గా ఉండేది. కానీ ఇప్పుడు  ఉమేశ్ యాదవ్, డెల్ స్టెయిన్ లాంటి సీనియర్ బౌలర్లతో పటిష్ఠంగా కనిపిస్తోంది. క్రిస్ మోరిస్ రూపంలో మంచి  ఆల్‌రౌండర్ కూడా అందుబాటులో ఉన్నాడు. యూఏఈ పిచ్‌లు స్వభావాన్ని బట్టి.. ఈ సీజన్లో స్పిన్నర్లు యజువేంద్ర చాహల్, ఆడమ్ జంపాలు జట్టు విజయాలలో కీలక పాత్రలు పోషించే అవకాశం ఉంది.

కోహ్లి 2013లో బెంగుళూరు సారథిగా బాధ్యతలు చేపట్టాక 2016లో మాత్రమే ఆ జట్టు ఫైనల్ చేరింది. మూడు సీజన్లపాటు పాయింట్ల పట్టికలో చివరిన నిలిచింది. గత సీజన్లలో కోహ్లి  ఎక్కువ ఉండే మాట వాస్తవం. అప్పుడే సిరీస్ ముగించుకొని ఐపీఎల్‌లో అడుగుపెట్టడం వల్ల భారం అధికంగా ఉండేది. కానీ ఈసారి కోహ్లి పూర్తి విశ్రాంతి తీసుకొని రిలాక్స్‌డ్‌ మోడ్ లో ఐపీఎల్‌లో అడుగుపెడుతున్నాడు. న్యూజిలాండ్ మాజీ కోచ్ మైక్ హెస్సన్, ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ సైమన్ కటిచ్ రూపంలో కొత్త సహాయక సిబ్బంది ఆర్సీబీకి అందుబాటులో ఉన్నారు. లెగ్ స్పిన్నర్ యుజువేంద్ర చాహల్ ఆ జట్టుకు జట్టుకు మంచి బూస్ట్ ఇచ్చే బౌలర్. మరి ఈ సారి కోహ్లి ఏ విధంగా జట్టును విజయతీరాలకు చేరుస్తాడో చూడాలి. సెప్టెంబర్ 21న దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఆర్సీబీ తొలి మ్యాచ్‌ సన్‌రైజర్స్‌తో ఆడబోతుంది.

Also Read :

అలెర్ట్ : కృష్ణా, తూర్పుగోదావరి జిల్లాలకు పిడుగు హెచ్చరిక

ఏపీలో హార్టికల్చర్ ఎంఎస్సీ, పీహెచ్ డీ విద్యార్థులకు స్టైఫండ్ పెంపు

ఏపీలో పెట్రోల్, డీజిల్‌పై సెస్ విధింపు