అలెర్ట్ : కృష్ణా, తూర్పుగోదావరి జిల్లాలకు పిడుగు హెచ్చరిక

ఏపీలోని కృష్ణా, తూర్పుగోదావరి జిల్లాలో పిడుగులు పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ శాఖ  హెచ్చరికలు జారీ చేసింది. 

అలెర్ట్ : కృష్ణా, తూర్పుగోదావరి జిల్లాలకు పిడుగు హెచ్చరిక
Follow us

|

Updated on: Sep 18, 2020 | 5:57 PM

ఏపీలోని కృష్ణా, తూర్పుగోదావరి జిల్లాలో పిడుగులు పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ శాఖ  హెచ్చరికలు జారీ చేసింది. కృష్ణా జిల్లా నందిగామ, చందర్లపాడు, జగ్గయ్యపేట, ఆగిరిపల్లి, నూజివీడు, బాపులపాడు,మైలవరం మండలాల్లో పిడుగులు పడే ఛాన్స్ ఉందని తెలిపింది. తూర్పుగోదావరి జిల్లాలోని  రాజమండ్రి, జగ్గంపేట, గండేపల్లి, సామర్లకోట, రంగంపేట, పెద్దాపురం, రాజనగరం మండలాల పరిసర ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉధృతంగా ఉన్నట్లు వెల్లడించింది. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కులీలు, పశు-గొర్రెల కాపరులు చెట్ల క్రింద , బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదని హెచ్చిరించింది. ప్రజలంతా సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొందాలని విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్  కె.కన్నబాబు సూచించారు.

Also Read :

వైఎస్ వివేకా హత్యకేసులో లేటెస్ట్ అప్డేట్

ఏపీలో హార్టికల్చర్ ఎంఎస్సీ, పీహెచ్ డీ విద్యార్థులకు స్టైఫండ్ పెంపు

ఏపీలో పెట్రోల్, డీజిల్‌పై సెస్ విధింపు

Latest Articles