రాజస్థాన్ రాయల్స్‌పై పంజాబ్ కింగ్స్ గెలుపు

మొహాలి: సీజన్‌లో రెండో విజయం సాధించిన తర్వాత కూడా రాజస్థాన్ రాయల్స్ పెద్దగా పుంజుకోలేకపోయింది.  ఆది నుంచి గెలుపు బాటలో పయనించి ఆఖరి మెట్టుపై బోల్తా పడింది. కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో మ్యాచ్‌లో ఓడి, సీజన్‌లో ఆరో పరాజయాన్ని చవి చూసింది. పంజాబ్‌ నిర్దేశించిన 183 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది రాజస్థాన్ . అర్షదీప్‌, అశ్విన్‌, షమి తలో రెండు వికెట్లు తీయడంతో రాజస్థాన్‌ కుదేలైంది. నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 170 పరుగులు మాత్రమే […]

రాజస్థాన్ రాయల్స్‌పై పంజాబ్ కింగ్స్ గెలుపు
Follow us

|

Updated on: Apr 17, 2019 | 8:49 AM

మొహాలి: సీజన్‌లో రెండో విజయం సాధించిన తర్వాత కూడా రాజస్థాన్ రాయల్స్ పెద్దగా పుంజుకోలేకపోయింది.  ఆది నుంచి గెలుపు బాటలో పయనించి ఆఖరి మెట్టుపై బోల్తా పడింది. కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో మ్యాచ్‌లో ఓడి, సీజన్‌లో ఆరో పరాజయాన్ని చవి చూసింది. పంజాబ్‌ నిర్దేశించిన 183 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది రాజస్థాన్ . అర్షదీప్‌, అశ్విన్‌, షమి తలో రెండు వికెట్లు తీయడంతో రాజస్థాన్‌ కుదేలైంది. నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 170 పరుగులు మాత్రమే చేసింది.

ఓపెనర్‌ రాహుల్‌ త్రిపాఠి (50; 45 బంతుల్లో 4×4), జోస్‌ బట్లర్‌ (23; 17 బంతుల్లో 1×4, 2×6) మెరుగైన ఆరంభాాన్ని అందించారు. సంజూ శాంసన్‌ (27; 21 బంతుల్లో 2×4) ఆకట్టుకున్నాడు. దీంతో 15 ఓవర్లకు రాజస్థాన్‌ 122/2తో విజయం వైపు పయనిస్తున్నట్టే అనిపించింది. ఆ తర్వాత ప్రతి పది పరుగుల వ్యవధిలో ఓ వికెట్‌ చేజార్చుకోవడంతో ఓటమి పాలైంది. అజింక్య రహానె (26; 21 బంతుల్లో 1×4) వేగంగా ఆడలేదు. జోఫ్రా ఆర్చర్‌ (1), ఆస్టన్‌ టర్నర్‌(0) నిరాశపరిచారు. చివర్లో స్టువర్ట్‌ బిన్నీ (33; 11 బంతుల్లో 2×4, 3×6) మెరిసినా అప్పటికే ఆలస్యమైంది. అంతకుముందు పంజాబ్‌లో కేఎల్‌ రాహుల్‌ (52), క్రిస్‌గేల్‌ (30), మయాంక్‌ అగర్వాల్‌(26), డేవిడ్‌ మిల్లర్‌ (40) రాణించారు.