బెంగుళూరు గెలిచిందోచ్..

Bangalore register first win beat Punjab by 8 wickets, బెంగుళూరు గెలిచిందోచ్..

ఐపీఎల్‌-12లో బెంగళూరు పరాజయ పరంపరకు బ్రేక్ పడింది. టోర్నీ ప్రారంభం నుంచి వరుస పరాజయాలతో పాయింట్ల పట్టికలో అట్టుడుగుపడిపోయిన రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టు ఎట్టకేలకు ఈ సీజన్‌ ఐపీఎల్‌లో తొలి విజయాన్ని నమోదు చేసింది. శనివారం స్థానిక ఐఎస్‌ బింద్రా మైదానంలో కింగ్స్‌ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో ఆర్సీబీ ఘన విజయం సాధించింది. వరుసగా ఆరు మ్యాచ్‌లు ఓడిన ఆర్‌సీబీ.. ఏడో మ్యాచ్‌లో విజయాన్నందుకుంది. 8 వికెట్ల తేడాతో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ను ఓడించింది. విరాట్ కోహ్లి, డివిలియర్స్‌ సత్తా చాటడంతో 174 పరుగుల లక్ష్యాన్ని బెంగళూరు 19.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది.

తొలుత బ్యాటింగ్‌  చేసిన కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది… కేఎల్‌ రాహుల్‌ 18 పరుగులు చేయగా… గేల్‌ 99 (నాటౌట్‌) తృటిలో సెంచరీ మిస్ అయ్యాడు, మయాంక్‌ 15 పరుగులు చేశారు. ఇక 174 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్‌సీబీ కోహ్లి, డివిలియర్స్‌ విజృంభించడంతో విజయాన్ని అందుకుంది. కోహ్లి 67 పరుగులు, డివిలియర్స్‌ 59 (నాటౌట్‌) పరుగులతో బెంగళూరు విజయంలో కీలక పాత్ర పోషించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *