Breaking News
  • కేంద్రమంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌కు చంద్రబాబు లేఖ. నరేగా పెండింగ్‌ నిధులను వెంటనే విడుదల చేయాలని వినతి. ఏపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ.. నిధులు విడుదల చేయకుండా పెండింగ్‌లో ఉంచింది. గతంలో నరేగా పనులు చేసినవారిపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది -లేఖలో చంద్రబాబు.
  • పదేళ్లలో జమ్మికుంట-హుజూరాబాద్‌ నగరాలు కలిసిపోతాయి. జంట నగరాలకు మున్సిపల్ చైర్మన్లుగా టీఆర్‌ఎస్ అభ్యర్థులే గెలుస్తారు. ఎన్నికల్లో ఓడిపోయినా ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా.. కేసీఆర్‌ నన్ను నియమించారు-వినోద్‌కుమార్‌. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించాలి -ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్.
  • కడప: పోరుమామిళ్ల మండలం మార్కాపురం దగ్గర గుర్తుతెలియని వాహనం ఢీకొని సిలాస్‌ అనే వ్యక్తికి తీవ్రగాయాలు, ఆస్పత్రికి తరలింపు.
  • నగరపాలక, మున్సిపల్‌ ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తిచేశాం. 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లలో రేపు ఓట్ల లెక్కింపు. ఈ నెల 27న మేయర్లు, చైర్‌పర్సన్ల ఎన్నికకు పరోక్ష ఎన్నికలు. ఈనెల 29న కరీంనగర్‌ మేయర్‌ ఎన్నిక-నాగిరెడ్డి. రేపు సాయంత్రంలోగా అన్ని ఫలితాలు వస్తాయి. పార్టీలు మేయర్‌, చైర్‌పర్సన్ల పేర్లను ఏ, బీ ఫారాల ద్వారా ఇవ్వాలి. ఈ నెల 26న ఉ.11 గంటలలోగా ఏ ఫామ్‌ ఇవ్వాలి. ఈ నెల 27న ఉ.11 గంటలలోగా బీ ఫామ్‌ ఇవ్వాలి -తెలంగాణ ఎన్నికల కమిషనర్‌ నాగిరెడ్డి.
  • శాసనమండలి తీరుపై ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ ఆగ్రహం. మంచి వ్యక్తితో తప్పుడు పనిచేయించిన చంద్రబాబును ఎవరూ క్షమించరు. వైసీపీ ఎమ్మెల్యేలను రాజీనామా చేయమని అడిగే హక్కు టీడీపీకి లేదు. ముందు టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి.. ఎన్నికలకు వెళ్లాలి -ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్.

‘రఫేల్‌’పై రాహుల్‌ విమర్శల పర్వం

, ‘రఫేల్‌’పై రాహుల్‌ విమర్శల పర్వం

ఢిల్లీ: గత కొంతకాలంగా అధికారపక్షంపై దాడి చేయడానికి ప్రతిపక్షం అధినేత రాహుల్ ఎంచుకున్న ప్రధాన అస్త్రం రపేల్ ఒప్పందం. ఈ విషయమై ప్రధాని మోదీపై రాహుల్ విమర్శల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా మరోసారి తన విమర్శల తీవ్రతను పెంచారు. రఫేల్‌ ఒప్పందానికి సంబంధించిన పత్రాలు చోరీకి గురయ్యాయని కేంద్రం నిన్న సుప్రీంకోర్టుకు వెల్లడించిన విషయం తెలిసిందే. దీనిపై రాహుల్‌ స్పందిస్తూ.. ‘పత్రాలు చోరీ అయ్యాయని ప్రభుత్వం చెప్పిందంటే అందులోని సమాచారం నిజమైనదేనని స్పష్టమవుతోంది. అంటే ఒప్పందంలో అవినీతి జరిగిందని రుజువైంది’ అని కేంద్రాన్ని దుయ్యబట్టారు.

రఫేల్ అంశంపై తాజాగా రాహుల్‌ మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘రఫేల్‌ పత్రాలు కన్పించకుండా పోయాయి. అంటే అందులోని సమాచారం నిజమేనని స్పష్టమవుతోంది. దీన్ని బట్టి చూస్తే రఫేల్‌ ఒప్పందంలో మోదీ జోక్యం ఉంది. ఈ ఒప్పందంపై ప్రధానమంత్రి కార్యాలయం ఫ్రాన్స్‌తో సమాంతర చర్చలు జరిపారనేది రుజువైంది. పత్రాల చోరీపై దర్యాప్తు జరుపుతామని కేంద్రం చెబుతోంది. కానీ రూ. 30వేల కోట్ల కుంభకోణానికి పాల్పడిన వ్యక్తిపై(మోదీని ఉద్దేశిస్తూ) మాత్రం ఎలాంటి దర్యాప్తు చేపట్టట్లేదు. రఫేల్‌ ఒప్పందానికి మోదీ బైపాస్‌ సర్జరీ చేశారు. అనిల్‌ అంబానీకి ప్రయోజనం చేకూర్చేందుకే కొనుగోలును ఆలస్యం చేశారు. అవకతవకలకు పాల్పడిన ప్రతి ఒక్కరిపై దర్యాప్తు జరపాలి. ప్రధానిని కూడా విచారించాలి’ అని రాహుల్‌ అన్నారు.