ఒళ్లు గగుర్పొడొచేలా భారత వాయుసేన ‘స్కై డైవింగ్‌’.. వీడియో చూడాల్సిందే

భారత వాయసేన సిబ్బంది ధైర్య సాహసాల తెలిపే ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

  • Tv9 Telugu
  • Publish Date - 12:03 pm, Tue, 11 August 20

Indian Air Force Skydiving Video: భారత వాయసేన సిబ్బంది ధైర్య సాహసాల తెలిపే ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌ తన అధికారిక సోషల్ మీడియాలో విడుదల చేసింది. దానికి.. ఓ విమానంలో నుంచి దూకాలంటే పిచ్చి వాడైనా ఉండాలి, లేదా స్కై డైవర్‌ అయినా అయ్యి ఉండాలి. భారత వాయుసేన సిబ్బంది అద్భుతంగా చేసిన ఆకాశ్‌గంగ స్కై డైవింగ్‌ను చూడండి. అందులో మేఘాలను దాటుకుంటూ, పక్షులతో పోటీ పడి వచ్చారు అని కామెంట్ పెట్టారు. ఇక ఈ వీడియోకు స్పందిస్తోన్న నెటిజన్లు వావ్, జై హింద్ జై భారత్‌, సెల్యూట్‌, రోమాలు నిక్కబొడుచుకున్నట్లుగా ఉంది, మిమ్మల్ని చూస్తే గర్వంగా ఉంది అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Read This Story Also: కురిచేడు శానిటైజర్‌ ఘటన.. వెలుగులోకి కీలక విషయాలు