India Vs Australia 2020: ఆస్ట్రేలియాకు మరో ఎదురుదెబ్బ.. స్టార్ బ్యాట్స్‌మెన్‌కు గాయం..! తొలి టెస్టుకు డౌటే..?
ఆస్ట్రేలియా జట్టును గాయాల బెడద వేధిస్తోంది. ఇండియాతో జరిగిన వన్డేలు, టీ20లు, ప్రాక్టీస్ మ్యాచ్‌ల్లో భాగంగా ఇప్పటికే 12 మంది ఆటగాళ్లు గాయాలపాలయ్యారు.

India Vs Australia 2020: ఆస్ట్రేలియా జట్టును గాయాల బెడద వేధిస్తోంది. ఇండియాతో జరిగిన వన్డేలు, టీ20లు, ప్రాక్టీస్ మ్యాచ్‌ల్లో భాగంగా ఇప్పటికే 12 మంది ఆటగాళ్లు గాయాలపాలయ్యారు. తాజాగా ఈ కోవలోకి ఆసీస్ స్టార్ బ్యాట్స్‌మెన్, టెస్ట్ నెంబర్ వన్ ప్లేయర్ స్టీవ్ స్మిత్ కూడా చేరాడు. అతడు వెన్ను నొప్పితో బాధపడుతున్నాడని విశ్వసనీయ వర్గాల సమాచారం. నిన్న జరిగిన కీలకమైన ప్రాక్టీస్ సెక్షన్‌కు దూరమైనా స్మిత్.. ఇవాళ కూడా సాధన చేయడని తెలుస్తోంది. అయితే ఆస్ట్రేలియా మీడియా మాత్రం భారత్‌తో జరిగే తొలి టెస్టుకు స్మిత్ బరిలోకి దిగుతాడని పేర్కొంది. అటు క్రికెట్ ఆస్ట్రేలియా మాత్రం ఇప్పటిదాకా స్మిత్ ఫిట్‌నెస్‌పై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
మంగళవారం అడిలైడ్‌లో సహచర ఆటగాళ్లతో కలిసి సాధన చేస్తున్న స్మిత్.. 10 నిమిషాల అనంతరం వెన్ను నొప్పితో బాధపడ్డాడు. బంతిని వంగి తీయడంలో ఇబ్బందికి గురయ్యాడు. దీనితో అతడు ఫిజియో సహాయాన్ని తీసుకుని డ్రెస్సింగ్ రూమ్ చేరుకున్నాడు. ఇప్పటికే పలువురు ప్లేయర్స్ గాయాలు కారణంగా తొలి టెస్టుకు దూరం కావడంతో ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు స్మిత్‌పై ప్రత్యేక దృష్టి సారించింది. కాగా, ఇరు జట్ల మధ్య తొలి డే/నైట్ టెస్ట్ రేపట్నుంచి అడిలైడ్ వేదికగా ప్రారంభం కానుంది.
Also Read:
బిగ్ బాస్ 4: టైటిల్ రేసులో టాప్‌కు ఎగబాకుతున్న అరియానా.! ఈసారి తెలుగమ్మాయి ట్రోఫీ కొట్టగలదా.?
కెప్టెన్‌గా స్మిత్‌కు ఇంకో ఛాన్స్ ఎండుకివ్వకూడదు.? సెలెక్టర్లపై ఆసీస్ మాజీ ప్లేయర్ ఫైర్.!
తొలి టెస్టు మ్యాచ్‌కు బరిలోకి దిగనున్న నటరాజన్.. ప్రత్యర్ధులకు ఇక చుక్కలు ఖాయం..
బీటెక్, డిగ్రీ విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఐబీఎం, టాస్క్ మధ్య కీలక ఒప్పందం..
తమిళ రాజకీయాల్లో సంచలనం.. తలైవా రజినీకాంత్ పార్టీ పేరు, గుర్తు ఖరారు..! వివరాలివే..