‘చంద్రయాన్ 2’కు ముహూర్తం కుదిరింది

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రతిష్టాత్మక ‘చంద్రయాన్ 2’ ప్రయోగానికి ముహూర్తం కుదిరింది. జూలై 15న ఏపీలోని శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం నుంచి తెల్లవారుజామున 2.51గంటలకు చంద్రయాన్ 2ను నింగిలోకి పంపనున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ 6న గానీ, 7 గానీ చంద్రయాన్ 2 చంద్రుడిపై దిగే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయాన్ని ఇస్రో చైర్మన్ డాక్టర్ కె. శివన్ వెల్లడించారు. ఈ ప్రయోగంలో కేవలం నేవిగేషన్, అటు శాటిలైట్ విభాగాలకు సంబంధించి రూ.603 కోట్లు […]

‘చంద్రయాన్ 2’కు ముహూర్తం కుదిరింది
Follow us

| Edited By:

Updated on: Jun 12, 2019 | 3:35 PM

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రతిష్టాత్మక ‘చంద్రయాన్ 2’ ప్రయోగానికి ముహూర్తం కుదిరింది. జూలై 15న ఏపీలోని శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం నుంచి తెల్లవారుజామున 2.51గంటలకు చంద్రయాన్ 2ను నింగిలోకి పంపనున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ 6న గానీ, 7 గానీ చంద్రయాన్ 2 చంద్రుడిపై దిగే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయాన్ని ఇస్రో చైర్మన్ డాక్టర్ కె. శివన్ వెల్లడించారు. ఈ ప్రయోగంలో కేవలం నేవిగేషన్, అటు శాటిలైట్ విభాగాలకు సంబంధించి రూ.603 కోట్లు వ్యయమవుతున్నట్లు శివన్ వివరించారు.

కాగా జీఎస్ఎల్వీ మార్క్ 3 రాకెట్ ద్వారా జరగనున్న ఈ ప్రయోగంలో ఇండియాకు చెందిన ఆరు, యూరప్‌కు చెందిన మూడు, అమెరికాకు చెందిన రెండు పేలోడ్స్‌ను చంద్రుడి మీదకు తీసుకెళ్లనున్నారు. కాగా 2001లో భారత్ చంద్రయాన్ 1ను ప్రయోగించిన విషయం తెలిసిందే.