Breaking News
  • హైదరాబాద్‌: తార్నాకలో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్‌ సదస్సు. పాల్గొన్న గవర్నర్‌ తమిళిసై.
  • ప్రకాశం జిల్లా మార్టూరుకు బయల్దేరిన చంద్రబాబు. ప్రజాచైతన్య యాత్రను ప్రారంభించనున్న చంద్రబాబు.
  • కడప: రాయచోటి వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం. పాల్గొన్న ఎంపీ మిథున్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి. పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించిన ఎంపీ, ఎమ్మెల్యేలు.
  • వరంగల్‌లో వాటర్‌ మెన్‌ ఆఫ్‌ ఇండియా రాజేంద్రసింగ్‌ గోదావరి యాత్ర. కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించి రైతులతో సమావేశం. గోదావరి జలాల సద్వినియోగంపై రాష్ట్ర ప్రభుత్వానికి ప్రశంసలు.
  • అమరావతి: చంద్రబాబు భద్రతను ఉద్దేశపూర్వకంగా తగ్గించారు. అధికార పార్టీ ఇలాంటి చర్యలకు పాల్పడడం తగదు-యనమల రామకృష్ణుడు. ఈ విషయంపై మండలిలో చర్చిస్తాం. అవసరమైతే ప్రివిలేజ్‌ కమిటీకి ఫిర్యాదు చేస్తాం-యనమల రామకృష్ణుడు.
  • నిర్మల్‌: మంచిర్యాలలో ఛత్రపతి శివాజీ విగ్రహావిష్కరణలో ఉద్రిక్తత. మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డిని అడ్డుకున్న బీజేపీ నేతలు. టీఆర్‌ఎస్‌, బీజేపీ నేతల మధ్య వాగ్వాదం, సర్దిచెప్పిన పోలీసులు. మంత్రితో కలిసి విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎంపీ సోయం బాపూరావు.

మొదటి టీ20: ఓపెనర్‌గా రాహుల్.. శాంసన్‌కు మరోసారి దక్కని చోటు!

IND Vs NZ, మొదటి టీ20: ఓపెనర్‌గా రాహుల్.. శాంసన్‌కు మరోసారి దక్కని చోటు!

సొంతగడ్డపై కంగారూలను ఓడించి ఫుల్ జోష్ మీద ఉన్న టీమిండియా నేటి నుంచి కివీస్‌తో తలబడనుంది. మూడు ఫార్మాట్ల సుదీర్ఘ సిరీస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య టీ20 సిరీస్ ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది. అయితే న్యూజిలాండ్‌ను వారి సొంతగడ్డపై ఓడించడం అంత సులభమేమి కాదు. టీ20ల్లో ఆ జట్టు ఎప్పుడూ ప్రమాదకరమే. ఆల్‌రౌండర్లతో నిండి ఉన్న కివీస్ జట్టు విసిరే సవాళ్లను కోహ్లీసేన ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాల్సిందే. గతంలో జరిగిన ఐదు సిరీస్‌ల్లో ఒకసారి పరిశీలిస్తే.. కేవలం ఒక్క దానిలో మాత్రమే ఇండియా విజయం సాధించడం గమనార్హం. ఇక ఈ రోజు మధ్యాహ్నం 12.20కు మొదలుకానున్న మొదటి టీ20 ఆక్లాండ్ వేదికగా జరగనుంది. ఈ పిచ్ పూర్తిగా బ్యాటింగ్‌కు అనుకూలిస్తుంది.

ఇదిలా ఉంటే కోహ్లీ టీమిండియా తుది జట్టు కూర్పును ముందుగానే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆసీస్‌తో సిరీస్‌లో అదరగొట్టిన కేఎల్ రాహుల్.. రోహిత్ శర్మతో కలిసి ఓపెనర్‌గా ఇన్నింగ్స్ ఆరంభించడమే కాకుండా వికెట్ కీపర్‌గా కూడా బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. దీని బట్టి చూస్తే రిషబ్ పంత్ బెంచ్‌కే పరిమితం కానున్నాడు. అంతేకాకుండా మరో వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్ సంజూ శాంసన్‌కు కూడా తుది జట్టులో చోటు దక్కే అవకాశాలు కనిపించట్లేదు. మిడిల్ ఆర్డర్‌లో శ్రేయాస్ అయ్యర్, మనీష్ పాండే, కోహ్లీలు ఆడనుండగా.. శివమ్ దూబే ఆల్‌ రౌండర్ పాత్ర పోషించనున్నాడు.

భారత్ జట్టు(అంచనా): రోహిత్‌, కేఎల్‌ రాహుల్‌, కోహ్లి (కెప్టెన్‌), శ్రేయస్‌ అయ్యర్‌, మనీష్‌ పాండే, శివమ్‌ దూబె, జడేజా/సుందర్‌, కుల్‌దీప్‌, షమి, సైని, బుమ్రా

కివీస్ జట్టు(అంచనా): గప్తిల్‌, మన్రో, సీఫెర్ట్‌, విలియమ్సన్‌ (విలియమ్సన్‌), రాస్‌ టేలర్‌, గ్రాండ్‌హోమ్‌/మిచెల్‌, శాంట్నర్‌, ఇష్‌ సోధి, సౌథీ, కుగెలీన్‌, బెనెట్‌

Related Tags