హోరాహోరీ పోరులో భారత్ విజయం

ఐసీసీ వరల్డ్ కప్ 2019లో భాగంగా అప్గానిస్తాన్‌తో జరిగిన ప్రపంచకప్ మ్యాచ్‌లో ఇండియా విజయం సాధించింది. 11 పరుగుల తేడాతో భారత్ గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 224 పరుగులు చేసింది. లక్ష్య చేధనలో అప్గానిస్తాన్ 213కు ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్‌లో చివరి ఓవర్ బౌలింగ్ వేసి మహ్మద్ షమీ వరుసగా మూడు వికెట్లు అప్గాన్ వెన్ను విరిచారు. ఎంతో ఉత్కంఠగా జరిగిన ఈ మ్యాచ్‌లో […]

హోరాహోరీ పోరులో భారత్ విజయం
Follow us

| Edited By:

Updated on: Jun 22, 2019 | 11:17 PM

ఐసీసీ వరల్డ్ కప్ 2019లో భాగంగా అప్గానిస్తాన్‌తో జరిగిన ప్రపంచకప్ మ్యాచ్‌లో ఇండియా విజయం సాధించింది. 11 పరుగుల తేడాతో భారత్ గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 224 పరుగులు చేసింది. లక్ష్య చేధనలో అప్గానిస్తాన్ 213కు ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్‌లో చివరి ఓవర్ బౌలింగ్ వేసి మహ్మద్ షమీ వరుసగా మూడు వికెట్లు అప్గాన్ వెన్ను విరిచారు. ఎంతో ఉత్కంఠగా జరిగిన ఈ మ్యాచ్‌లో అప్గానిస్తాన్ భారత్‌కు దీటుగా ఆడింది.

టీమిండియా బ్యాటింగ్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లీ, కేదార్ జాదవ్ మినహా మిగిలిన వారందరూ బ్యాటింగ్‌లో విఫలమయ్యారు. ఫలితంగా భారత బ్యాట్స్‌మెన్‌లో కోహ్లీ 67, జాదవ్ 52 పరుగులతో అర్థశతకాలు సాధించగా రాహుల్ (30), విజయ్ శంకర్ (29), ధోని (28) ఒక మోస్తరుగా పరుగులు చేశారు. ఓపెనర్లలో ఒకరైన రోహిత్‌తో పాటు షమీ, కుల్‌దీప్, బుమ్రా కేవలం ఒక పరుగు వ్యక్తిగత స్కోరుకే పరిమితమయ్యారు. అప్గానిస్థాన్ బౌలింగ్‌లో గుల్బదిన్, నబీ చెరి రెండు, ముజీబ్, అఫ్తాబ్, రషీద్, రహ్మత్ తలో వికెట్ తీశారు.

ఆఫ్ఘనిస్తాన్ బ్యాట్స్‌మెన్‌లో మహ్మద్ నబీ (51) అర్థశతకం నమోదు చేసుకోగా, కెప్టెన్ గుల్‍బదిన్ నైబ్ 27 పరుగులు సాధించాడు. ఈ జట్టులోని మిగిలిన ఆటగాళ్ళ విషయానికి వస్తే రహ్మత్ షా (36) పరుగులతో కాస్త రాణించాడు. ఇతర ఆటగాళ్ళు హష్మతుల్లా షాహిది, నజీబుల్లా చెరి 21 పరుగులు చేశారు. భారత బౌలర్లు షమీ 4 వికెట్లు తీయగా, బుమ్రా, చాహల్, హార్దిక్ పాండ్య తలా 2 వికెట్లు పడగొట్టారు.