Breaking News
  • ఏడు నెలల పాలనలో జగన్‌ విఫల నాయకుడిగా పేరుపొందారు. ప్రతిపక్ష నేతను అసెంబ్లీలోకి రాకుండా అడ్డుకోవడం ఎన్నడూ చూడలేదు. ఉద్యోగ సంఘాలు కూడా చంద్రబాబు మాటలను వక్రీకరించడం బాధాకరం. చౌకబారు రాజకీయాలు సరికాదు-నక్కా ఆనందబాబు.
  • ప్రకాశం: ఒంగోలులో సీపీఎస్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో మనోవేదన నిరసన ర్యాలీ, పాల్గొన్న కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల ప్రభుత్వ ఉద్యోగులు.
  • కృష్ణాజిల్లా: కీసర టోల్‌ప్లాజా దగ్గర పనిచేయని ఫాస్టాగ్‌. ఇబ్బందులు పడుతున్న వాహనదారులు. రెండు క్యాష్‌ కౌంటర్ల ద్వారా టోల్‌ వసూలు చేస్తున్న సిబ్బంది.
  • చిత్తూరు టూటౌన్‌ పీఎస్‌ దగ్గర ఉద్రిక్తత. ఆత్మహత్య చేసుకున్న ఫాతిమా మృతదేహంతో తల్లిదండ్రుల ధర్నా. నిందితుడిని తప్పించేందుకు పోలీసులు యత్నిస్తున్నారని ఆరోపణ. పోలీస్‌స్టేషన్‌ ఎదుట ఫాతిమా మృతదేహంతో తల్లిదండ్రుల ఆందోళన.
  • చెన్నై వన్డేలో టాస్‌గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న విండీస్‌. భారత్‌-విండీస్‌ మధ్య తొలివన్డే.
  • తిరుమల: ధనుర్మాసం సందర్భంగా ఈ నెల 17 నుంచి జనవరి 14 వరకు శ్రీవారి సుప్రభాత సేవ రద్దు.
  • విశాఖ: హుకుంపేట మండలం రంగశీలలో కాల్పులు. రైతుభరోసా నగదు కోసం అన్నదమ్ముల మధ్య వివాదం తనవాటా డబ్బులు అడిగిన తమ్ముడు జయరాం, భార్య కొండమ్మపై నాటు తుపాకీతో కాల్పులు జరిపిన అన్న కృష్ణ. తమ్ముడి భార్య కొండమ్మ చేతిలోకి దూసుకెళ్లిన బుల్లెట్. కొండమ్మను చికిత్స నిమిత్తం కేజీహెచ్‌కు తరలింపు. కాల్పులు జరిపి సమీప కొండల్లోకి పారిపోయిన కృష్ణ.

మళ్లీ తెరపైకి హనీ ట్రాప్.. ఈసారి ఏమైందంటే..?

Madhya Pradesh 3 women detained for honey-trapping politicians and top govt officials, మళ్లీ తెరపైకి హనీ ట్రాప్.. ఈసారి ఏమైందంటే..?

ప్రపంచదేశాలు ఉగ్రవాద నిర్మూలకు కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఏదో ఒక విధంగా ఉగ్రవాద దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా భారత్‌లో గత నాలుగేళ్లుగా ఉగ్రవాదులు దేశంలో అడుగుపెట్టాలని చేస్తున్న ప్రయత్నాలు అన్నింటిని భారత సైన్యం సమర్థవంతంగా ఎదుర్కొంటోంది. దీంతో ఉగ్రవాదులు రూటు మార్చారు. యువతే లక్ష్యంగా ప్లాన్ వేశారు. తమ ప్లాన్‌ను పక్కాగా అమలు చేసి.. బలం పెంచుకునే పనిలో పడ్డారు. ఉగ్రవాదం వైపు యువతను ఆకర్షించేందుకు ఆపరేషన్ హనీ ట్రాప్‌ను చేపట్టారు.

ఇక తాజాగా హనీ ట్రాప్ మళ్లీ తెరమీదకు వచ్చింది. ప్రముఖ రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులను హనీట్రాప్ చేసి వారిని బ్లాక్ మెయిల్ చేసిన ముగ్గురు మహిళల ముఠా గుట్టును మధ్యప్రదేశ్ రాష్ట్ర పోలీసులు బయటపెట్టారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ నగరానికి చెందిన ముగ్గురు మహిళలు ఓ యువకుడు కలిసి ముఠాగా ఏర్పడి కొందరు రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులను లక్ష్యంగా చేసుకొని హనీట్రాప్ చేసి, వారిని బ్లాక్ మెయిల్ చేసిన బాగోతాన్ని ఇండోర్ పోలీసులు కనిపెట్టారు. వారికి అందిన సమాచారం ప్రకారం ఇండోర్ పోలీసులు హనీట్రాప్ చేసి డబ్బులు గుంజుతున్న ముగ్గురు మహిళలు, ఓ యువకుడిని అరెస్టు చేశారు. వీరు ముగ్గురు పలువురు రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులను బ్లాక్ మెయిల్ చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం రేపిన ఈ కేసు దర్యాప్తును మధ్యప్రదేశ్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ దర్యాప్తు చేపట్టింది.

అసలు హనీ ట్రాప్ అంటే ఏంటి..?

హనీ ట్రాప్ అంటే అందమైన అమ్మాయిలను ఎరగా వేయడం. సోషల్ మీడియా వేదికగా చేసుకుని యువకులను, రాజకీయ నేతలను ముగ్గులోకి లాగడం. ఆ తర్వాత వారిని బ్లాక్ మెయిల్ చేస్తూ ఉగ్రవాదులకు కావాల్సిన సహాయ సహకారాలు పొందటం. వీలైతే సైనిక రహస్యాలను తెలుసుకోవడం. ఫేస్ బుక్‌లో అమ్మాయిల పేరుతో పరిచయమై వారితో స్నేహం చేస్తారు. మెల్లగా ఉగ్రబాట వైపు వారిని మళ్లించే ప్రయత్నం చేస్తారు. సరిగ్గా సంవత్సరం క్రితం జమ్ముకళ్మీర్‌కు షాదియానా అనే మహిళను అరెస్టు చేయడంతో ఉగ్రవాదుల ప్లాన్ ప్రపంచానికి తెలిసింది. బందీపురాకు చెందిన షాదియానా ఫేస్ బుక్ వేదికగా జీహాద్‌కు పనిచేస్తోంది. ఆయుధాలు చేతపట్టాలని యువకులను రెచ్చగొడుతోందని గుర్తించిన పోలీసులు ఉగ్రవాదుల సరికొత్త ప్లాన్‌కు ప్రారంభంలోనే చెక్ పెట్టారు. అయితే పాకిస్థాన్ కేంద్రంగా ఈ హనీ ట్రాప్‌లో ఇప్పటికే 1100 మంది భారత యువకులు చిక్కుకున్నట్లు గుర్తించారు. మొత్తం 13 ఫేస్ బుక్ అకౌంట్ల ద్వారా ఐఎస్ఐ వలపుల వల విసరడంతో ఆ 1100 మందిపై ఏటీఎస్ నిఘా పెట్టింది.

మరోసారి హనీ ట్రాప్ అంశం తెరపైకి రావడంతో ఉగ్రమూకలు భారత్‌లో అడుగుపెట్టేందుకు మళ్లీ ప్రయత్నిస్తున్నారా..? ఆ మధ్య పాకిస్థాన్, ఇప్పుడు మధ్యప్రదేశ్ ఇలా ఎక్కడడెక్కడ వారి కదలికలు మొదలయ్యాయి..? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరి దీనిపై అధికారులు, పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు చూడాలి మరి.