ఇప్పట్లో ముంబయికి వచ్చే ధైర్యం లేదు: నితిన్ గడ్కరీ

దేశవ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతోంది. లక్షకు పైగా కేసులతో దేశంలో మొదటి స్థానంలో నిలిచింది మహారాష్ట్ర. ఆ రాష్ట్ర రాజధాని ముంబయిలోనే 59వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి.

ఇప్పట్లో ముంబయికి వచ్చే ధైర్యం లేదు: నితిన్ గడ్కరీ
Follow us

| Edited By:

Updated on: Jun 16, 2020 | 8:45 PM

దేశవ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతోంది. లక్షకు పైగా కేసులతో దేశంలో మొదటి స్థానంలో నిలిచింది మహారాష్ట్ర. ఆ రాష్ట్ర రాజధాని ముంబయిలోనే 59వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. అందులో పోలీసులు, వైద్యులు, ప్రజా ప్రతినిథులు చాలా మందే ఉన్నారు. దీంతో అక్కడికి వెళ్లేందుకు చాలా మంది భయపడుతున్నారు. మరోవైపు మహారాష్ట్ర నుంచి వస్తోన్న వారి విషయంలో మిగిలిన రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. ఇదిలా ఉంటే ప్రస్తుత పరిస్థితుల్లో ముంబయికి వచ్చేంత ధైర్యం లేదని అన్నారు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ. ”ప్రస్తుత పరిస్థితుల్లో ముంబయికి వచ్చేంత సాహసం చేయలేను. కానీ సమయం గడిచే కొద్ది ఈ పరిస్థితిలో మార్పు వస్తుందని ఆశిస్తున్నా” అని నితిన్ గడ్కరీ అన్నారు.

Read This Story Also: కరోనా టెన్షన్.. కేసీఆర్ సమావేశం జరిగిందిలా..!