ఆఫీస్‌కి పిలుస్తారనుకున్నా కానీ.. : జగన్‌పై చిరు ఆసక్తికర వ్యాఖ్యలు

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన ఆతిథ్యాన్ని ఎప్పటికీ మరిచిపోనని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత జగన్ తీసుకున్న

ఆఫీస్‌కి పిలుస్తారనుకున్నా కానీ.. : జగన్‌పై చిరు ఆసక్తికర వ్యాఖ్యలు
Follow us

| Edited By:

Updated on: Apr 24, 2020 | 7:23 PM

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన ఆతిథ్యాన్ని ఎప్పటికీ మరిచిపోనని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత జగన్ తీసుకున్న పలు నిర్ణయాలకు చిరంజీవి తన మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. అంతేకాదు సైరా విడుదలైన తరువాత సతీసమేతంగా జగన్ ఇంటికి వెళ్లారు చిరు. ఆ సందర్భంగా జగన్ దంపతులు తమకు ఇచ్చిన ఆతిథ్యాన్ని ఎప్పటికీ మర్చిపోనని ఆయన అన్నారు.

వైఎస్ కుటుంబంతో తనకు మంచి సాన్నిహిత్యం ఉంది. సాక్షి ప్రారంభోత్సవంలో నేను పాల్గొన్నా. అంతేకాదు ఆ ఛానెల్‌లో జరిగిన అవార్డు ఫంక్షన్‌లకు నేను హాజరయ్యా. ఆ సమయంలో వైఎస్‌ భారతి ఇచ్చిన గౌరవం నన్ను చాలా ఆకట్టుకుంది. ఇక ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణ స్వీకారానికి నాకు ఆహ్వానం వచ్చింది. కానీ కొన్ని కారణాల వలన హాజరుకాలేకపోయాను. ఆ సమయంలో ఫోన్‌ చేసి జగన్‌కు అభినందనలు తెలిపా అని చిరు అన్నారు.

ఇక తాను నటించిన సైరాను పలువురు నాయకులకు చూపించాలని అనుకున్నా. ఆ క్రమంలోనే వైఎస్ జగన్ అపాయింట్‌మెంట్ అడిగా. అప్పుడు జగన్ నన్ను ఆఫీస్‌కు పిలుస్తారేమో అనుకున్నా. కానీ తన ఇంటికి ఆయన పిలిచారు. దాంతో నేను, సురేఖ జగన్ ఇంటికి వెళ్లాము. ఆ సమయంలో జగన్-భారతి ఇచ్చిన ఆతిథ్యాన్ని ఎప్పటికీ మర్చిపోను అని తెలిపారు. ఇక పిలుపు వస్తే వైసీపీలోకి వెళతారా…? అన్న ప్రశ్నకు స్పందిస్తూ.. ప్రస్తుతం నేను రాజకీయాలకు దూరంగా ఉన్నా. కానీ ఎవరూ మంచి చేసినా నేను అభినందిస్తా. మూడు రాజధానుల కాన్సెప్ట్ నాకు నచ్చింది. దీనివలన అభివృద్ధి జరుగుతుందని భావిస్తున్నా. అందుకే ఆ ప్రతిపాదనకు నా మద్దతిచ్చా అని చిరు తెలిపారు.

Read This Story Also: వెలుగులోకి మరో షాకింగ్ న్యూస్.. ఆ లక్షణాలున్నా కరోనా ఉన్నట్లే..!