భార్య తల నరికి.. పోలీస్‌స్టేషన్‌‌లో లొంగిపోయిన భర్త

చిత్తూరు జిల్లా కడకల మండలానికి చెందిన ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కొంతకాలం తర్వాత ఇద్దరికి మనస్పర్దలు వచ్చాయి. భార్య పుట్టింటికి వెళ్లింది. భర్తతో కాపురానికి రాలేదు. దీంతో కొంతకాలంగా భార్యపై అనుమానం పెరిగింది. చివరకు భ్యారను చంపాలని నిర్ణయించుకున్నాడు. పథకం ప్రకారం ఆమెకు అనుమానం రాకుండా బయటకు తీసుకెళ్లి కొడవలితో కిరాతకంగా నరికి చంపాడు. కడప జిల్లా అసన్‌జీవాండ్ల పల్లెకు చెందిన హుస్సేనయ్య, చిత్తూరు జిల్లా మర్రిపాడు కాలనీకి చెందిన నాగూర్ అమ్మాజీని తొమ్మిదేళ్ల క్రితం […]

భార్య తల నరికి.. పోలీస్‌స్టేషన్‌‌లో లొంగిపోయిన భర్త
Follow us

| Edited By:

Updated on: Jun 19, 2019 | 9:02 AM

చిత్తూరు జిల్లా కడకల మండలానికి చెందిన ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కొంతకాలం తర్వాత ఇద్దరికి మనస్పర్దలు వచ్చాయి. భార్య పుట్టింటికి వెళ్లింది. భర్తతో కాపురానికి రాలేదు. దీంతో కొంతకాలంగా భార్యపై అనుమానం పెరిగింది. చివరకు భ్యారను చంపాలని నిర్ణయించుకున్నాడు. పథకం ప్రకారం ఆమెకు అనుమానం రాకుండా బయటకు తీసుకెళ్లి కొడవలితో కిరాతకంగా నరికి చంపాడు.

కడప జిల్లా అసన్‌జీవాండ్ల పల్లెకు చెందిన హుస్సేనయ్య, చిత్తూరు జిల్లా మర్రిపాడు కాలనీకి చెందిన నాగూర్ అమ్మాజీని తొమ్మిదేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. అయితే కొద్దికాలం తర్వాత భార్యభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో భార్య పుట్టింటికి వెళ్లింది. అక్కడే ఆశాకార్యకర్తగా పనిచేస్తూ పిల్లలను పోషించుకుంటోంది. హుస్సేనయ్య లారీ డ్రైవర్‌గా పని చేస్తూ అప్పుడప్పుడు భార్య దగ్గరకు వచ్చి వెళ్తుండేవాడు. భార్యను పలుమార్లు తన ఇంటికి కాపురానికి రమ్మని పిలిచినా రాలేదని, అక్కడే ఉండటంతో ఆమె పై అనుమానం పెంచుకున్నాడు. చివరికి భార్యను హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. పథకం ప్రకారం భార్యను నమ్మించి ఘాతుకానికి పాల్పడ్డాడు. భార్య తలను నరికి ప్లాస్టిక్ కవర్లో పెట్టుకుని నేరుగా పోలీస్ స్టేషన్‌కి వెళ్లాడు. జరిగిన విషయాన్ని పోలీసులకు వివరించి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. కేసు నమోదు చేసుకున్న ఎస్సై వంశీధర్ తన సిబ్బందితో ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. హత్య జరిగిన విషయం తెలుసుకున్న మృతురాలి కుటుంబసభ్యులు, బంధువులు పోలీసులను ఆశ్రయించి తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ ఘటన మండలంలో కలకలం సృష్టించింది.

మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో