Occult Worshiping: రోడ్డు ప్రమాదాలు తగ్గాలని పందెం కోడి బలిచ్చిన పోలీసులు.. ఎక్కడో తెలుసా..?

|

Feb 13, 2022 | 12:27 PM

జంతు బలులకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ ప్రజల్ని చైతన్యం చేసే పోలీసులే.. మూఢ నమ్మకాలను ఫాలో అయ్యారా? ప్రజలకు భరోసా కల్పించాల్సిన పోలీసులే.. పాడు పనులకు పాల్పడుతున్నారు.

Occult Worshiping: రోడ్డు ప్రమాదాలు తగ్గాలని పందెం కోడి బలిచ్చిన పోలీసులు.. ఎక్కడో తెలుసా..?
Cock
Follow us on

Worshiping Occult in Police Station: జంతు బలులకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ ప్రజల్ని చైతన్యం చేసే పోలీసులే.. మూఢ నమ్మకాలను ఫాలో అయ్యారా? ప్రజలకు భరోసా కల్పించాల్సిన పోలీసులే.. పాడు పనులకు పాల్పడుతున్నారు. తాజాగా ప్రకాశం జిల్లా బల్లికురవ పోలీస్‌స్టేషన్‌లో జరిగిన తంతు వివాదాస్పదం అవుతోంది. నమ్మకం ఉండాలి… అది మూఢనమ్మకం కాకూడదు.. అందులోను ప్రభుత్వ కార్యాలయాల్లో మూఢ నమ్మకాలు, జంతుబలులతో పూజలు చేయడం సంచలనంగా మారింది.

ప్రకాశం జిల్లాలోని బల్లికురవ పోలీసుల వ్యవహార శైలి చర్చనీయాంశంగా మారింది. ఇటీవలి కాలంలో బల్లికురవ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదాలు పెరిగిపోయాయి. ప్రమాదాల నివారణ కోసం తగిన భద్రతా చర్యలు చేపట్టాల్సిన పోలీసులు.. మూఢ నమ్మకాలను ఆశ్రయించారు. నల్లకోడిని బలిచ్చి పోలీస్‌స్టేషన్‌లో పూజా కార్యక్రమాలు చేయడం స్థానికంగా ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది.

కేవలం నల్లకోడిని బలివ్వడంతో బల్లికురవ పోలీసులు ఆగలేదు.. ఆ కోడి రక్తాన్ని గోడలపై ముద్రలుగా వేశారు. ఇదే ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. మూఢనమ్మకాలపై ప్రజల్లో చైతన్యo నింపాల్సిన పోలీసులే ఇలా వ్యవహరించడం ఏంటని హేతువాద సంఘాల నాయకులు మండిపడుతున్నారు. మరోవైపు.. బల్లికురవ పోలీస్ స్టేషన్‌కు రావాలంటేనే ప్రజలు భయపడుతున్న పరిస్థితి. ఇందులో మరో ట్విస్టు కూడా ఉంది. పోలీస్‌ స్టేషన్‌లో బలిచ్చిన నల్లకోడి.. ఇటీవల కోడిపందాల దాడుల్లో పట్టుబడినది చెప్తున్నారు. ఇది మరో చర్చగా మారింది. స్థానికంగా ఈ వ్యవహారం కలకలం రేపడంతో బల్లికురువ ఎస్సై అప్రమత్తమయ్యారు. తన స్టేషన్‌లో తనకు తెలీకుండా ఇదంతా జరిగిందని చెప్పారాయన.

Read Also… Statue Of Equality: ముచ్చింతల్‏లో సమాతామూర్తి సన్నిదిలో మెగాస్టార్ ‘చిరంజీవి’ మరియు ఉపరాష్ట్రపతి ‘వెంకయ్య నాయుడు’..(ఫొటోస్)