
విమానం లేదా షిప్ లో ట్రావెల్ చేసేటప్పుడు విండో సీటు కావాలని కోరుకుంటారు చాలామంది. విమానాల్లో విండో సీటు ధర కూడా ఎక్కువగా ఉంటుంది. అయితే విండో సీట్లలో ఎక్కువగా కూర్చునేవారు గమనించే ఉంటారు. ప్రతి విమానంలో విండోస్ చాలా చిన్న సైజులో గుండ్రని షేప్ లో ఉంటాయి. విండోస్ పెద్ద సైజులో ఉంటే వ్యూ ఇంకా బాగా ఎంజాయ్ చేయొచ్చు. కానీ అవి మాత్రం చిన్నగానే ఉంటాయి. సముద్రాల్లో ప్రయాణించే షిప్ ల్లో కూడా ఇదే తరహాలో స్మాల్ అండ్ రౌండ్ విండోస్ ఉంటాయి. అయితే వాటిని అలా రూపొందించడం వెనుక ఒక బలమైన కారణమే ఉంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
విమానం లేదా షిప్ ల్లో ఉండే కిటికీలు పూర్తిగా చతురస్రాకారంలో ఉంటే అవి గాలి ఒత్తిడిని తట్టుకోలేవట. దీంతో త్వరగా పగుళ్లు ఏర్పడే అవకాశం ఉంటుంది. గుండ్రని ఆకారపు విండో గాలి ఒత్తిడిని తట్టుకుంటుందట. అందుకే విమానం, షిప్పుల్లో గుండ్రటి కిటికీలను అమర్చుతారు. విమానం ఆకాశంలో ఉన్నప్పుడు గాలి పీడనం రెండు వైపులా ఉంటుంది. బయట లోపలా పీనడం మారుతూ ఉంటుంది. దీనివల్ల విమానం పై ఎక్కువ ఒత్తిడి పడుతుంది. ఈ ఒత్తిడిని తట్టుకుని నిలబడాలంటే కిటికీలు చిన్నగా ఉండాలి. కిటికీ సైజుని పెంచితే.. అది మొత్తం విమానం స్ట్రక్చర్‌నే దెబ్బతీస్తుంది. విమానం సేఫ్టీ బ్యాలెన్స్ దెబ్బతింటుంది. అందుకే కిటికీ సైజును చిన్నగా ఉంచుతారు.
పూర్వం రోజుల్లో విమానాలకు చతురస్రాకారపు కిటికీలు ఉండేవి. అప్పట్లో విమానాలు తక్కువ ఎత్తులో తక్కువ వేగంతో ప్రయాణించేవి. విమానంపై పడే పీడనం తక్కువగా ఉండేది. అయితే రానురాను విమానాలు డెవలప్ అవుతూ వచ్చాయి. ఇప్పుడు విమానాలు చాలా ఎత్తులో హై స్పీడ్ లో ప్రయానిస్తున్నాయి. విమానం బాడీ ఆ పీడనాన్ని తట్టుకోవాలంటే దానికి అనుగుణంగా కిటికీలు అమర్చాలి. అందుకే వాటిని చతురస్రం నుండి గుండ్రంగా మార్చాల్సి వచ్చింది. విమానాలకు పెద్ద కిటికీలు పెడితే ప్రెజర్ లీక్ అయ్యే ప్రమాదం ఉంది. ఇది విమానం కూలిపోవడానికి కారణమవుతుంది. అందుకే చిన్న కిటికీలను చాలా దృఢంగా ప్రత్యేక పదార్థాలతో తయారుచేస్తారు. తద్వారా ఎక్కువ వేగం, ఎత్తులో ఉన్నప్పుడు కిటికీలు పగిలిపోకుండా ఉండగలుగుతాయి.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..