
దేశ రక్షణ అనగానే మనకు గుర్తొచ్చే మొదటి పదం అర్మీ.. ఈ పేరు వినగానే.. రోమాలు నిక్కబొడుచుకుంటాయి.. గుండెల్లో ధైర్యం నిండుతుంది. శత్రు దేశాల నుంచి వచ్చే తూటాలకు తమ రొమ్ములను అడ్డుపెట్టే మనల్ని రక్షించే యోదులు గుర్తొస్తారు. వాళ్లే చేసే త్యాగాలు గుర్తొస్తాయి. కానీ ఈ ఆర్మీ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది.. ఈ పదానికి అర్థం ఏమిటి అనేది మీరెప్పుడైనా ఆలోచించారా? ప్రతి పౌరుడు కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం ఇది. కాబట్టి అసలు ఆర్మీకి ఆ పేరెలా వచ్చింది. దానికి అర్థం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ARMY అనే పదం ఎలా వచ్చింది?
ARMY అనే పదం లాటిన్ భాషలోని ‘ఆర్మాటా’ అనే పదం నుండి వచ్చింది. ఈ పదానికి అర్థం ఏమిటి అంటే.. ఆయుధాలు కలిగిన ఆయుధ బలగమని. సాధారణంగా ఆర్మీ అంటే నేలపైన యుద్ధం చేస్తూ, దేశ రక్షణ బాధ్యతను తమ భుజాలపై మోసే సైన్యం. ఇందులో సైనికులు, అధికారులు, సహాయక సిబ్బంది ఉంటారు. వీరు క్రమబద్ధంగా పనిచేయడానికి వివిధ విభాగాలు, రెజిమెంట్లు, డివిజన్లుగా విడిపోతారు. అయితే ఈ ఆర్మీ అనే పదాన్ని సులభంగా గుర్తుంచుకోవడానికి కొన్ని కోడ్స్ కూడా ఉన్నాయి.
ఈ నాలు అక్షరాలు సైనికులకు ఉండవలసిన నాలుగు లక్షణాలను సూచిస్తాయి
అప్రమత్తత : సరిహద్దుల్లో ఉండే సైనికులు ప్రతి క్షణం అలెర్ట్‌గా ఉండాలి. ఎందుకంటే ఒక్క క్షణం ఏమరుపాటుగా ఉన్నా, చిన్న నిర్లక్ష్యం చేసినా.. అది దేశానికి పెద్ద నష్టాన్ని కలిగిస్తుంది. అందుకే సైనికులకు అప్రమత్తత అనేది మొదటి లక్షణం.
నిరంతర శిక్షణ: ఓక సైనికులు ఎప్పుడూ క్రమశిక్షణతో ఉండాలి. రెగ్యులర్‌గా వర్కౌట్స్, వ్యాయామం ఎంతో ముఖ్యం. ఎందుకంటే ఆయుధాలను ఉపయోగించడం, శారీరక దృఢత్వం కాపాడుకోవడం, యుద్ధ విన్యాసాలు చేయడం వారి దినచర్యలో భాగం.
వేగం: యుద్ధాలు లేదా ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు సైనికులు తక్షణమే ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి చేరుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఒక సైనికుడి క్విక్ రెస్పాన్స్ అనేది చాలా ముఖ్యం. చిన్నపాటి ఆలస్యం కూడా వారి జీవితంలో పెద్ద నష్టాన్ని కలిగించవచ్చు.
యువ శక్తి : సరిహద్దు ప్రాంతాల్లో పరిస్థితులు ఎప్పుడూ అనుకూలంగా ఉండవు.. చలి, వాన, ఎండ.. ఇలా ఎలాంటి కఠినమైన వాతావరణం, మంచు పర్వతాలు, ఎడారులు లేదా అడవులైనా సైనికులు తమ ధైర్యసాహసాలతో పనిచేస్తారు. కాబట్టి వాటిని తట్టుకోవడానికి యువ శక్తి ఎంతగానో అవసరం.
భారతీయ సైన్యం
భారతదేశంలో ఆర్మీని అధికారికంగా ‘భారతీయ థల్ సేన’ అని పిలుస్తారు. ఇది దేశ సరిహద్దులను రక్షించడమే కాకుండా, ప్రకృతి వైపరీత్యాలు, అత్యవసర పరిస్థితుల్లో ప్రజలను కాపాడుతుంది. ARMY అనేది కేవలం ఒక పదం మాత్రమే కాదు.. అది అప్రమత్తత, క్రమశిక్షణ, వేగం, యువశక్తుల కలయిక. దేశం కోసం తమ ప్రాణాలను సైతం లెక్క చేయని యోదుల అసలు సిసలైన లక్షణం.
మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.