
మనం సాధారణంగా ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద రెడ్, గ్రీన్, ఎల్లో సిగ్నళ్లను చూస్తుంటాం. అప్పుడప్పుడు సిగ్నల్స్ వద్ద VAC, MNL, ATC” అనే అక్షరాలు కూడా దర్శనమిస్తుంటాయి. వాటిని మనం గమనిస్తుంటాం. కానీ, చాలా మంది వీటి అర్థం మాత్రం తెలియదు. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పట్టణాలు, నగరాలు అనే తేడా లేకుండా రోజు రోజుకు భారీ సంఖ్యలో వాహనాలు పెరిగిపోతున్నాయి. దేశంలోని హైదరాబాద్ వంటి మహానగరాల్లో నిత్యం లక్షల సంఖ్యలో వాహనాలు రహదారులపై ప్రయాణిస్తుంటాయి. దీంతో రహదారులపై ట్రాఫిక్ రద్దీ ఏర్పడి.. ప్రజలు తమ గమ్య స్థానాలకు చేరుకునేందుకు గంటల సమయం పడుతుంది. అయితే, ట్రాఫిక్‌ను సజావుగా నిర్వహించేందుకు ప్రధాన కూడళ్లు, రద్దీ ఎక్కువగా ఉండే రోడ్ల వద్ద ట్రాఫిక్ సిగ్నళ్లు ఏర్పాటు చేశారు. ఇవి కేవలం వాహనాల రాకపోకలను నియంత్రించడమే కాదు, రోడ్డు ప్రమాదాలను తగ్గించడంలో కూడా కీలక పాత్ర పోషిస్తున్నాయి.
ఈ నియమాలు అందరికీ తెలిసినవే. అయితే, సిగ్నల్ లైట్లపై చిన్న డిస్‌ప్లేలో కనిపించే “VAC, MNL, ATC” వంటి అక్షరాలు చాలా మందికి తెలియకపోవచ్చు. వాస్తవానికి, ఈ టెక్నికల్ కోడ్స్ సిగ్నల్ ఎలా పనిచేస్తుందో తెలియజేస్తాయి. ట్రాఫిక్ అధికారులు చెబుతున్నట్లుగా, ఈ కోడ్స్ ద్వారా సిగ్నల్ ఆపరేషన్ విధానం అర్థమవుతుంది.
ట్రాఫిక్ సిగ్నళ్లపై కనిపించే ఈ చిన్న కోడ్స్ సాధారణంగా కనిపించినా, వాటి వెనుక ఉన్న సాంకేతికత చాలా కీలకం. MNL, VAC, ATC వంటి విధానాలు నగర ట్రాఫిక్ నిర్వహణను మరింత సమర్థవంతంగా మార్చుతున్నాయి. పెరుగుతున్న వాహనాల సంఖ్యను దృష్టిలో ఉంచుకుంటే, ఇలాంటి స్మార్ట్ ట్రాఫిక్ వ్యవస్థలు భవిష్యత్తులో మరింత అవసరంగా మారనున్నాయి. మనమూ ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటిస్తేనే ఈ వ్యవస్థలు పూర్తిస్థాయిలో ప్రయోజనం చేకూరుస్తాయి.