Cricketer Sophie Devine: సోఫీ డెవిన్.. మ్యాచ్ మాత్రమే కాదు హృదయాలను కూడా గెలుచుకుంది.. వావ్..

క్రికెట్‌లో సెంచరీ కొట్టడం అంటే మాములు విషయం కాదు. అది కూడా ఓ మెగా టోర్నీలో మ్యాచ్ అయితే..ఆ క్రికెటర్‌ ఆనందం అంతా, ఇంతా ఉండదు. అయితే న్యూజిల్యాండ్ మహిళా క్రికెటర్..

Cricketer Sophie Devine: సోఫీ డెవిన్.. మ్యాచ్ మాత్రమే కాదు హృదయాలను కూడా గెలుచుకుంది.. వావ్..

Updated on: Jan 16, 2021 | 2:41 PM

Cricketer Sophie Devine:  క్రికెట్‌లో సెంచరీ కొట్టడం అంటే మాములు విషయం కాదు. అది కూడా ఓ మెగా టోర్నీలో మ్యాచ్ అయితే..ఆ క్రికెటర్‌ ఆనందం అంతా, ఇంతా ఉండదు. అయితే న్యూజిల్యాండ్ మహిళా క్రికెటర్.. సోఫీ డెవిన్ ఫాస్టెస్ట్ సెంచరీ కొట్టిన అనంతరం కనీసం బ్యాట్ కూడా పైకెత్తలేతు. ముఖంలో ఆనందం కనిపించకపోగా..ఆందోళన, ఆవేదన కనిపించడం గమనార్హం. అందుకు కారణం ఆమె సిక్సర్‌గా మలిచిన బంతి మ్యాచ్‌ను వీక్షిస్తున్న ఓ చిన్నారిని బలంగా తాకడం.

వివరాల్లోకి వెళ్తే..వుమెన్స్ సూపర్ స్మాష్ టీ20 టోర్నీలో న్యూజీల్యాండ్ క్రికెటర్ సోఫీ డెవిన్ 38 బంతుల్లో 108 పరుగులు చేసి అదరగొట్టింది. వెల్లింగ్టన్ బ్లేజ్ తరుఫున ఆడుతోన్న ఆమె.. డెత్ ఓవర్‌లో సెంచరీ చేసే క్రమంలో భారీ సిక్సర్ బాదింది. ఆ బంతి నేరుగా వెళ్లి ఓ చిన్నారిని తాకింది. ఆపై మరో రెండు బంతుల్లో మ్యాచ్ ముగించిన సదరు ప్లేయర్.. బ్యాట్ గ్రౌండ్‌లో పడేసి బంతి తగిలిన పాప వద్దకు పరిగెత్తుకు వెళ్లి.. యోగక్షేమాలు తెలుసుకుంది. చిన్నారికి సారీ చెప్పి..స్టేడియంలోని ప్రేక్షకులే కాదు.. నెటిజన్ల హృదయాలు కూడా గెలుచుకుంది.

Also Read:

Ice cream tests positive for corona: ఐస్‌ క్రీమ్‌ ద్వారా కరోనా వ్యాప్తి.. సంచలన విషయాన్ని వెల్లడించిన పరిశోధకులు!

ABP-C Voter Survey: జాతీయ స్థాయిలో జగన్ మార్క్.. ఏబీపీ న్యూస్-సీ ఓటర్ సర్వేలో మెరుగైన ర్యాంక్.. టాప్-5 సీఎంలు వీరే