శాకాహారులు అంటే మొదటగా గుర్తుకు వచ్చేది భారతీయులే. ప్రపంచంలో శాకాహారాన్ని ఎక్కువగా ఇష్టపడేది భారతీయులు మాత్రమే. శాకాహార వంటకాల విషయానికి వస్తే.. భారతదేశంలోని రకరకాల శాకాహార వంటకాలు ఎవరినైనా ఆకర్షిస్తాయి. ముఖ్యంగా కొన్ని రకాల ఆహారం పేరు చెబితేనే మనసు టెంప్ట్ అవుతుంది. అయితే ప్రపంచంలోనే అతిపెద్ద వెజ్ రెస్టారెంట్ ఎక్కడ ఉంది అని ఆలోచిస్తే.. ఈ రెస్టారెంట్ భారతదేశంలో ఉంటుందని ఆలోచిస్తే పూర్తిగా తప్పు.. ఎందుకంటే ప్రపంచంలో అతి పెద్ద వెజ్ రెస్టారెంట్ యూరోపియన్ దేశమైన స్విట్జర్లాండ్‌లో ఉంది.
జ్యూరిచ్‌లోని హౌస్ హిల్ల్ ప్రపంచంలోనే అత్యంత పురాతన శాకాహార రెస్టారెంట్. ఇప్పటికే ఈ రెస్టారెంట్ తన పేరుని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో నమోదు చేసుకుంది. ఈ రెస్టారెంట్ కు గత వంద ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. పూర్తిగా శాకాహార రెస్టారెంట్. యూరప్ లోని ప్రజలు తినే స్టైల్ మార్చేసింది ఈ రెస్టారెంట్. ఇది 1898 లో స్థాపించబడింది.
నివేదిక ప్రకారం ఈ రెస్టారెంట్‌ను 1898లో జ్యూరిచ్‌లోని హిల్ట్ కుటుంబం ప్రారంభించింది. ప్రారంభమైనప్పటి నుండి ఈ రెస్టారెంట్ ఆహార ప్రియులకు ఇష్టమైన రెస్టారెంట్‌గా మిగిలిపోయింది. ఈ కుటుంబంలో ఎన్ని తరాలు తమ పూర్వీకుల వారసత్వాన్ని కొనసాగిస్తున్నాయో.. ఎలా విజయవంతమయ్యాయో ఎవరికీ పూర్తిగా తెలియదని చెప్పవచ్చు. అయితే ఈ రెస్టారెంట్‌లో స్థానిక వంటకాలు మాత్రమే లభిస్తాయి. బఫెట్‌లో భారతీయ, స్విస్, థాయ్, సెంట్రల్ యూరోపియన్, యూరోపియన్, మెడిటరేనియన్, ఆసియా వంటకాలతో కలిపి 100కి పైగా వంటకాలు ఉన్నాయి. ఈ రెండంతస్తుల రెస్టారెంట్‌లో భోజనంతో పాటు వంటలకు చెందిన పుస్తకాలను కూడా చదవొచ్చు.
ఒకప్పుడు ఇక్కడికి వచ్చేవారిని గడ్డి తినేవాళ్ళు అని ఆటపట్టించేవారు.. అయితే కాలక్రమంలో ఈ రెస్టారెంట్ ఎంత సక్సెస్ సొంతం చేసుకున్నదంటే గత కొన్ని దశాబ్దాల్లో ఈ రెస్టారెంట్ సొంతంగా 8 ఫ్రాంచైజీలను ప్రారంభించింది. అయితే ఇప్పుడు ఈ రెస్టారెంట్ కేవలం శాకాహారులకు మాత్రమే ఎందుకు అనే ప్రశ్న మదిలో మెదిలితే.. శతాబ్దాల క్రితం అంబ్రోసియస్ హిల్ట్ అనే టైలర్ ఉండేవాడు. అతను ఎక్కువగా మాసంహారం తినేవాడు. ఈ అలవాటు వల్ల అతడు తీవ్ర అనారోగ్యం బారిన పడ్డాడు. తరువాత తన ఆహారపు అలవాట్లు వదిలి పూర్తి శాకాహార రెస్టారెంట్‌ని నిర్మించాడు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..