Viral News: ఈ దేశంలో రాత్రిపూట సూర్యోదయం అవుతుంది.. అందమైన అద్భుత దృశ్యాలు మీకోసం..

|

Sep 16, 2023 | 8:06 AM

ఈ భూమిపై అందమైన ప్రదేశాలు చాలా ఉన్నాయి. ఈ దృశ్యాలు, సంఘటనలు ఎవరినైనా ఆశ్చర్యానికి గురి చేస్తాయి. ఈ ప్రదేశాలలో ప్రకృతి తన అందాలతో కనువిందు చేస్తుంటుంది. సాధారణంగా సూర్యుడు అస్తమిస్తే రాత్రి అవడం, సూర్యుడు ఉదయిస్తే పగలు అవడం తెలిసిన ముచ్చటే. కానీ, ఈ దేశంలో మాత్రం చాలా భిన్నంగా ఉంటుంది సూర్యుడి వ్యవహారం. ప్రపంచమంతటా ఉదయాన్నే సూర్యుడు ఉదయిస్తే.. ఈ దేశంలో మాత్రం అర్ధరాత్రి సూర్యుడు ఉదయిస్తాడు. ఈ దృగ్విషయాన్ని అర్థం చేసుకోవడానికి

Viral News: ఈ దేశంలో రాత్రిపూట సూర్యోదయం అవుతుంది.. అందమైన అద్భుత దృశ్యాలు మీకోసం..
Sunrise In Norway
Follow us on

Viral Video: ఈ భూమిపై అందమైన ప్రదేశాలు చాలా ఉన్నాయి. ఈ దృశ్యాలు, సంఘటనలు ఎవరినైనా ఆశ్చర్యానికి గురి చేస్తాయి. ఈ ప్రదేశాలలో ప్రకృతి తన అందాలతో కనువిందు చేస్తుంటుంది. సాధారణంగా సూర్యుడు అస్తమిస్తే రాత్రి అవడం, సూర్యుడు ఉదయిస్తే పగలు అవడం తెలిసిన ముచ్చటే. కానీ, ఈ దేశంలో మాత్రం చాలా భిన్నంగా ఉంటుంది సూర్యుడి వ్యవహారం. ప్రపంచమంతటా ఉదయాన్నే సూర్యుడు ఉదయిస్తే.. ఈ దేశంలో మాత్రం అర్ధరాత్రి సూర్యుడు ఉదయిస్తాడు. ఈ దృగ్విషయాన్ని అర్థం చేసుకోవడానికి సైన్స్ పై పరిజ్ఞానం ఉండాల్సిందే. అయితే, ఇందుకు సంబంధించిన విశిష్ట కథను వివరంగా తెలుసుకుందాం..

ఏది ఆ దేశం..

అర్థరాత్రి సూర్యుడు ఉదయించే దేశం నార్వే. నార్వేలో సూర్యుడు దాదాపు రాత్రి 1:30 గంటలకు ఉదయిస్తాడు. నిజానికి ఈ దేశంలో సూర్యుడు కేవలం 40 నిమిషాలు మాత్రమే అస్తమించడం జరుగుతుంది. అంటే, ఇక్కడ సూర్యాస్తమయం దాదాపు 12:43కి జరుగుతుంది. సూర్యోదయం సరిగ్గా 40 నిమిషాల తర్వాత అంటే 1:30కి జరుగుతుంది. ఈ అందమైన దృశ్యాన్ని చూసేందుకు ప్రపంచం నలుమూలల నుంచి ప్రజలు ఇక్కడికి వస్తుంటారు. ఈ అర్ధరాత్రి సూర్యుడిని ప్రజలు ఎలా ఆస్వాదిస్తారో కింది వీడియోలో చూడొచ్చు.

76 రోజులు ఉంటుంది..

ఈ అందమైన దృశ్యం ఒకటి రెండు రోజులు కాదండోయ్.. ఏకంగా 76 రోజుల పాటు కొనసాగుతుంది. ఈ సమయంలో ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ఈ దేశాన్ని సందర్శిస్తుంటారు. ఇక నార్వేను యావత్ ప్రపంచం మిడ్‌నైట్ సన్ దేశం అని పిలుస్తుంది. వాస్తవానికి, నార్వే యూరోపియన్ ఖండానికి ఉత్తరాన ఉంది. ఈ దేశం ఉత్తర ధ్రువానికి చాలా దగ్గరగా ఉంది. దీని కారణంగా ఇక్కడ వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. అతి ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఈ దేశం ఆర్కిటిక్ సర్కిల్‌లో ఉంది. అందుకే ప్రపంచంలో మరెక్కడా జరగని ఇలాంటి అందమైన దృశ్యానికి సాక్షాత్కారం అవుతుంది.

మరిన్ని హ్యూమన్ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..