Kalpana Chawla:అంతరిక్షయానంలో తొలి భారత మహిళా వ్యోమగామి ‘కల్పనా చావ్లా’ చివరి జీవన ప్రయాణం

|

Jan 16, 2022 | 8:10 AM

భారత సంతతికి చెందిన మొదటి మహిళా వ్యోమగామి కల్పనా చావ్లా(Kalpana Chawla) సరిగ్గా ఈరోజున చివరిసారిగా అంతరిక్షంలో ప్రయాణించారు. 16 జనవరి 2003న, కల్పన నాసా (NASA) స్పేస్ షటిల్ కొలంబియా స్పేస్ షటిల్ నుంచి అంతరిక్షంలోకి వెళ్లింది.

Kalpana Chawla:అంతరిక్షయానంలో తొలి భారత మహిళా వ్యోమగామి కల్పనా చావ్లా చివరి జీవన ప్రయాణం
Kalpana Chawla
Follow us on

భారత సంతతికి చెందిన మొదటి మహిళా వ్యోమగామి కల్పనా చావ్లా(Kalpana Chawla) సరిగ్గా ఈరోజున చివరిసారిగా అంతరిక్షంలో ప్రయాణించారు. 16 జనవరి 2003న, కల్పన నాసా (NASA) స్పేస్ షటిల్ కొలంబియా స్పేస్ షటిల్ నుంచి అంతరిక్షంలోకి వెళ్లింది. కానీ ఆమె మళ్లీ భూమికి తిరిగి రాలేకపోయింది. కల్పన అంతరిక్ష నౌక 1 ఫిబ్రవరి 2003న భూమికి తిరిగి వస్తుండగా కుప్పకూలింది. ఈ స్పేస్ షిప్‌లోని కల్పనా చావ్లాతో సహా మొత్తం ఏడుగురు వ్యోమగాములు ఈ ప్రమాదం కారణంగా మరణించారు.

కల్పనా చావ్లా 1962 జూలై 1న హర్యానాలోని కర్నాల్‌లో జన్మించారు. ఆమె తన నలుగురు తోబుట్టువులలో చిన్నది. కల్పనకు చిన్నప్పటి నుంచి విమానాల ప్రపంచంపై ఆసక్తి ఉండేది. ఆమె తన ప్రారంభ విద్యను కర్నాల్ నుంచి ప్రారంభించింది. దీని తర్వాత పంజాబ్ ఇంజినీరింగ్ కాలేజీ నుంచి ఏరోనాటికల్ ఇంజినీరింగ్‌లో బీటెక్ చేశారు.

అమెరికా నుంచి ఏరోస్పేస్ ఇంజినీరింగ్‌లో పట్టా ..

కల్పన 1982లో అమెరికా వెళ్లారు. అతను 1984లో యూనివర్శిటీ ఆఫ్ టెక్సాస్ నుంచి ఏరోస్పేస్ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీని పొందాడు. 1986లో రెండో మాస్టర్స్ డిగ్రీ చేసి, అదే సబ్జెక్టుపై పీహెచ్‌డీ చేశారు. కల్పనా చావ్లా 1983లో ఫ్రాన్స్‌కు చెందిన జాన్ పియర్‌ని వివాహం చేసుకున్నారు. అతను వృత్తిరీత్యా ఫ్లయింగ్ ఇన్‌స్ట్రక్టర్.

భారత సంతతికి చెందిన తొలి మహిళా వ్యోమగామి

కల్పనా చావ్లా 1991లో అమెరికా పౌరసత్వం పొంది అదే ఏడాది నాసాలో చేరారు. 1997లో, ఆమె అంతరిక్షంలోకి వెళ్లేందుకు నాసా స్పెషల్ షటిల్ ప్రోగ్రామ్‌లో ఎంపికైంది. కల్పనా చావ్లా మొదటి అంతరిక్ష యాత్ర 19 నవంబర్ 1997న కొలంబియా స్పేస్ షటిల్ (STS-87) ద్వారా ప్రారంభం అయింది. దీంతో అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారతీయ సంతతి మహిళగా రికార్డు సృష్టించింది.

అప్పటికి కల్పన వయసు 35 ఏళ్లు. తన మొదటి అంతరిక్ష యాత్రలో, చావ్లా 6.5 మిలియన్ మైళ్లకు పైగా ప్రయాణించారు. 376 గంటలు (15 రోజులు .. 16 గంటలు) అంతరిక్షంలో గడిపారు. ఇది కల్పనా చావ్లా చివరి విజయవంతమైన అంతరిక్ష ప్రయాణంగా నిలిచిపోయింది. తరువాత 16 జనవరి 2003న, కల్పనా చావ్లా తన జీవితంలో రెండవ .. చివరి అంతరిక్ష యాత్రలో భాగమయ్యారు.

ఇవి కూడా చదవండి: Worlds Powerful Passports: ప్రపంచ వ్యాప్తంగా పవర్‌ఫుల్‌ పాస్‌పోర్ట్‌ ర్యాంకులో భారత్‌.. ఎన్నో ర్యాంకు అంటే..!

Pakistan: భూకంపంతో వణికిపోయిన పాకిస్తాన్.. రిక్టర్‌ స్కేల్‌పై 5.6 తీవ్రత..