Jackfruit: అమ్మ బాబోయ్.. ఎంత పెద్దదో..! కోనసీమలో 80 కిలోల బాహుబలి పనస పండు

| Edited By: Ravi Kiran

May 29, 2024 | 12:16 PM

పనస పండు గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. అయితే, పనసకాయ బరువు విషయానికి వస్తే సాధారణంగా 20 నుంచి 25 కిలోలుండడం మామూలే. కానీ, ఏకంగా నిలువెత్తు మనిషి బరువంత భారీ పనసను ఎప్పుడైనా చూశారా?

Jackfruit: అమ్మ బాబోయ్.. ఎంత పెద్దదో..! కోనసీమలో 80 కిలోల బాహుబలి పనస పండు
Biggest Jackfruit
Follow us on

పండ్లలో భారీ పండు ఏదయా అంటే.. టక్కున గుర్తొచ్చేదీ పనస పండే! అందరూ ఎంతో ఇష్ట పడి తినే వాటిల్లో పనస పండు కూడా ఒకటి. పనస పండు గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. అయితే, పనసకాయ బరువు విషయానికి వస్తే సాధారణంగా 20 నుంచి 25 కిలోలుండడం మామూలే. కానీ, ఏకంగా నిలువెత్తు మనిషి బరువంత భారీ పనసను ఎప్పుడైనా చూశారా? అవునండీ.. మన తెలుగువారి ఇంట 80 కిలోల పనస పండింది. అంతే, కాదు.. ఆ పండు ఇప్పుడు ప్రపంచ రికార్డు కొట్టేయబోతోంది..!

అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేటలో అబ్బుర పరుస్తోందీ భారీ బాహుబలి పనస పండు. 80 కిలోల బరువు భారీ పొడవున ఉన్న పనస పండు అందరిని ఆకట్టుకుంటుంది. పి.గన్నవరం లంకలలో ఉండే చెట్ల నుంచి పనస పండు తెచ్చామని పళ్ళ వ్యాపారి చెబుతున్నారు. సాధారణంగా 25,30 కేజీలు బరువు మాత్రమే పనసపండు వుంటుంది. అయితే ప్రస్తుతం కనిపిస్తున్న ఈ పనస ఏకంగా 80 నుండి 90 కేజీల బరువు ఉందని చెబుతున్నారు.
మీరే చూడండి..

తాము 30 ఏళ్లుగా పళ్ళ వ్యాపారం చేస్తున్నామని కానీ ఇంత పెద్ద పనస పండు ఎప్పుడు చూడలేదు అంటున్నారు పళ్ళ వ్యాపారి. అయితే ఒక పనసపండును ఏకంగా ముగ్గురు మోసుకు రావడం అందరిని ఆశ్చర్యాన్ని గురిచేస్తోంది. ఇంత పెద్ద బాహుబలి పనస పండును పల్ల ప్రియులు ఆసక్తిగా చూస్తున్నారు. ఈ పనస పండులో సుమారు 800 నుండి 900 పనస తొనలు ఉంటాయని వ్యాపారి ప్రభు చెబుతున్నారు. విక్రయానికి పెట్టిన ఈ పనస పండు ధర ఎంత అని అడిగి తెలుసుకుని షాక్ గురై వెళ్తున్నారు స్థానికులు.

పనస పండుతో ఒక్కటేంటీ చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి. వేసవిలో తినే వాటిల్లో పనస పండు కూడా ఒకటి. ఇందులో కూడా వాటర్ కంటెంట్, ఫైబర్ శాతం అధికంగా ఉంటుంది. ఎలాంటి వారైనా పనస పండును తినొచ్చు. పనస పండులోని ప్రతి భాగంలో కూడా చాలా పోషకాలు ఉంటాయి. పనస కాయ, పనస తొనలు, పనస గింజలు ఇలా అన్నింటినీ తినొచ్చు. అయితే ముఖ్యంగా పనస పండు తినడం వల్ల మగవారికి చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు నిపుణులు.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..