How to Find Spy Camera: స్పై కెమెరాను ఎక్కడ పెడతారు.. దానిని కనుగొనే సులభమైన మార్గాలు ఇవే..

|

Jun 05, 2022 | 3:20 PM

How to Find Spy Camera:  ఒక్కోసారి హోటళ్లు, పీజీలు, హాస్టళ్లు వంటి చోట్ల రహస్య కెమెరాలు అమర్చారు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో అలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. 

How to Find Spy Camera: స్పై కెమెరాను ఎక్కడ పెడతారు.. దానిని కనుగొనే సులభమైన మార్గాలు ఇవే..
Spy Camera Hidden Camera
Follow us on

హిడెన్ కెమెరా, మీరు ఈ పదాన్ని చాలాసార్లు విని ఉంటారు. మీరు ఎప్పుడూ దాని కంట్లో పడకపోతే మీరు అదృష్టవంతులు అని చెప్పవచ్చు. ఒక్కోసారి హోటళ్లు, పీజీలు, హాస్టళ్లు వంటి చోట్ల రహస్య కెమెరాలు అమర్చిన ఘటన చాలా వెలుగులో వచ్చాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో అలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. బాలికల హాస్టల్ బాత్‌రూమ్‌లో ఓ డాక్టర్ కొడుకు రహస్య కెమెరా పెట్టాడు. స్పై కెమెరా ఎవరికీ కనిపించకుండా షవర్‌లో దాచాడు. ఇలాంటి కేసు ఇదే మొదటిది కాదు. ఇలాంటి ఘటనలు రోజురోజుకు వెలుగులోకి వస్తున్నాయి. అటువంటి పరిస్థితిలో కొన్ని విషయాలపై శ్రద్ధ, కొంచెం అప్రమత్తత ఉంటే చాలు మిమ్మల్ని మీరు కాపాడుకున్నట్లే.. మీ హోటల్ లేదా హాస్టల్‌లో రహస్య కెమెరా ఉందో లేదో మీరు ఎలా తనిఖీ చేయవచ్చో తెలుసుకోండి. హిడెన్ కెమెరాలు చాలా చిన్నవిగా ఉంటాయి. కానీ మీరు బాత్రూంలో ఉన్నా, ఏదైనా స్టోర్‌ చేంజింగ్ రూంలో బట్టలు మార్చుకుంటున్నా.. లేక హోటల్ గదిలో మీ భాగస్వామితో ఉన్నా అక్కడ జరిగేదంతా రికార్డ్ చేస్తుంటాయి.

ఈ ప్రదేశాలలో కెమెరాలు అమర్చబడతాయి

కెమెరాను దాచడానికి.. అటువంటి ప్రదేశాలు ఉపయోగించబడతాయి.. ఇవి సాధారణంగా మన కంటికి కనిపించవు. ఉదాహరణకు, కెమెరాను స్మోక్ డిటెక్టర్‌లు, ఎయిర్ ఫిల్టర్ పరికరాలు, పుస్తకాలు, గోడపై ఏదైనా, డెస్క్ ప్లాంట్, టిష్యూ బాక్స్, స్టఫ్డ్ టెడ్డీ, డిజిటల్ టీవీ బాక్స్, హెయిర్ డ్రైయర్, వాల్ క్లాక్, పెన్ లేదా ఏదైనా క్లాత్‌లో దాచవచ్చు. చాలా సందర్భాలలో  బాత్రూమ్ షవర్లు, పైకప్పులు, తలుపు రంధ్రాలు, డెస్క్ ప్లాన్లలో దాచిన కెమెరాలు అమర్చి ఉంటాయి. మీరు హోటల్ లేదా హాస్టల్‌లో ఉంటున్నట్లయితే.. ఖచ్చితంగా ఈ స్థలాలను ఓ సారి చెక్ చేసుకోండి.

నైట్ విజన్ కెమెరాను ఎలా కనుగొనాలి

ఈ రకమైన కెమెరాలను కనుగొనడానికి.. మీరు నైట్ విజన్ సెక్యూరిటీ కెమెరా పని తీరుతో ఉపయోగించవచ్చు.చాలా రహస్య కెమెరాలు ఆకుపచ్చ లేదా ఎరుపు LED లైట్లను కలిగి ఉంటాయి. ఈ లైట్లు మెరుస్తూనే ఉంటాయి. అలాంటి కెమెరాలను కనుగొనడానికి.. మీరు గదిలో కరెంట్ ఆఫ్ చేయాలి.. ఆ తర్వాత పరిశీలిస్తే.. దానిలోని LED లైట్లు మెరుస్తాయి. కాబట్టి అవి తక్కువ-కాంతి లేదా చీకటిలో సులభంగా కనుగొనబడతాయి. మొదట కెమెరాను ఎక్కడెక్కడ రహస్యంగా అమర్చగలరో తెలుసుకోవచ్చు

ఇవి కూడా చదవండి

ఈ కెమెరాలను సాధారణంగా ఎక్కడ దాస్తారంటే..

  • అద్దాల వెనుక
  • తలుపుపై
  • గోడ మూల ఎక్కడైనా
  • పైకప్పులో
  • ల్యాంప్‌లో
  • ఫొటో ఫ్రేంలో
  • టిష్యూ పేపర్ డబ్బాలో
  • పూలకుండీలో
  • స్మోక్ డిటెక్టర్‌లో

మొబైల్ ఫోన్లు కూడా సహాయపడతాయి

తమ మొబైల్ ఫోన్ సహాయంతో రహస్య కెమెరాను కనుగొనగలమా అనే ప్రశ్న చాలా మందికి ఉంటుంది. దీనికి శాస్త్రీయంగా నిరూపితమైన ఏ ఫార్మూలా లేదు.. కానీ కొన్నిసార్లు పనికి వచ్చే కొన్ని ఉపాయాలు ఇక్కడ ఉన్నాయి. దాచిన కెమెరా రేడియో ఫ్రీక్వెన్సీలను ఉత్పత్తి చేస్తుంది కాబట్టి.. మీరు వాటిని మీ ఫోన్‌తో చెక్ చేసుకోండి. ఇందుకోసం ఫోన్ చేసి అనుమానాస్పద ప్రాంతాల దగ్గరికి వెళ్లాలి. రేడియో ఫ్రీక్వెన్సీ కారణంగా మీ ఫోన్ కాల్ సమస్యాత్మకంగా ఉంటుంది. చాలా సందర్భాలలో వాయిస్ స్పష్టంగా ఉండదు. ఈ విధంగా మీరు కెమెరాను గుర్తించవచ్చు.

రెండవ మార్గం Play Store, Apple App Storeలో ఉన్న అనేక యాప్‌ల ద్వారా. మీరు మీ స్మార్ట్‌ఫోన్‌లో ‘డిటెక్ట్ హిడెన్ కెమెరాస్’ కేటగిరీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసి, దాన్ని లాంచ్ చేయాలి. మీ ఫోన్ కెమెరాను గుర్తించినట్లయితే, స్క్రీన్‌పై ఎరుపు రంగు గ్లో కనిపిస్తుంది. అయితే, ఈ యాప్‌లు ప్రతిసారీ ఖచ్చితమైన సమాచారాన్ని అందించాల్సిన అవసరం లేదు.