Vastu Tips: ఇంట్లో ఈ సమస్యలు ఉంటే నెగిటివ్‌ ఎనర్జీ ఉన్నట్లే..

అయితే మనకు తెలిసో తెలియకో కొన్ని వాస్తు దోషాలు ఇంట్లో ఉండే ఉంటాయి. వీటివల్ల ఇంట్లో నెగిటివ్‌ ఎనర్జీ ఉంటుంది. ఈశాన్యంలో చెత్తాచెదారం ఉండడం, బాత్‌రూమ్‌లు సరైన దిశలో ఉండకపోవడం ఇలా పలు దోషాల కారణంగా ఇంట్లో నెగిటివ్‌ ఎనర్జీ పెరుగుతుంది. అయితే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందా.? లేదా.? అనే విషయాన్ని కొన్ని లక్షణాల ద్వారా తెలుసుకోవచ్చు...

Vastu Tips: ఇంట్లో ఈ సమస్యలు ఉంటే నెగిటివ్‌ ఎనర్జీ ఉన్నట్లే..
Vastu Tips
Follow us

|

Updated on: Jul 05, 2024 | 6:16 PM

వాస్తుకు ఎంతటి ప్రాధాన్యత ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మరీ ముఖ్యంగా భారతీయులు వాస్తును తూచా తప్పకుండా పాటిస్తుంటారు. ఇంట్లో ప్రశాంత వాతావరణం ఉండాలంటే ఇంటి నిర్మాణం వాస్తు ప్రకారం ఉండాలని భావించే వాళ్లు చాలా మంది ఉంటారు. అందుకే వాస్తు పండితులను సంప్రదిస్తుంటారు.

అయితే మనకు తెలిసో తెలియకో కొన్ని వాస్తు దోషాలు ఇంట్లో ఉండే ఉంటాయి. వీటివల్ల ఇంట్లో నెగిటివ్‌ ఎనర్జీ ఉంటుంది. ఈశాన్యంలో చెత్తాచెదారం ఉండడం, బాత్‌రూమ్‌లు సరైన దిశలో ఉండకపోవడం ఇలా పలు దోషాల కారణంగా ఇంట్లో నెగిటివ్‌ ఎనర్జీ పెరుగుతుంది. అయితే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందా.? లేదా.? అనే విషయాన్ని కొన్ని లక్షణాల ద్వారా తెలుసుకోవచ్చు. ఇంతకీ ఇంట్లో నెగిటివ్‌ ఎనర్జీ ఉందని చెప్పే ఆ లక్షణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* రాత్రుళ్లు కలలు రావడం సర్వసాధారణమైన విషయం. అయితే పీడ కలలు వస్తూంటే మాత్రం ఇంట్లో ఏదో నెగిటివ్‌ ఎనర్జీ ఉందని అర్థం చేసుకోవాలి. వెంటనే వాస్తు పండితులను సంప్రదించి వాస్తును చూపించుకోవాలి.

* ఆలోచనలు స్థిరంగా ఉండకపోవడం, ఆత్మహత్య చేసుకోవాలి, ఏదో తెలియని ఆందోళన వంటి సమస్యలు వేధిస్తుంటే ఇంట్లో నెగిటివ్‌ ఎనర్జీ ఉందని అర్థం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

* ఇక ఇల్లు ఎంత శుభ్రంగా ఉన్నా ఏదో తెలియని దుర్వాసన వస్తుంటే ఇంట్లో ఏదో తెలియని నెగిటివ్ ఎనర్జీ ఉందని అర్థం చేసుకోవాలి. ఇలా ఉంటే నీటిలో కర్పూరం వేసి ఫ్లోర్‌ను శుభ్రం చేసుకోవాలి.

* కుటంబ సభ్యుల మధ్య సక్యత లేకపోయినా, నిత్యం ఏదో ఒక గొడవ జరుగుతున్నా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందని అర్థం చేసుకోవాలి.

* దీర్ఘకాలంగా ఆర్థిక సమస్యలు వెంటాడుతున్నా. సంపాదించిన డబ్బు సపాదించినట్లు ఖర్చవుతున్నా. ఇంట్లో నెగిటివ్‌ ఉండొచ్చని వాస్తు పండితులు చెబతుఉన్నారు.

* ఇక ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులు నిత్యం అనారోగ్యాల బారిన పడుతున్నా, ఆసుపత్రుల చుట్టూ ఎక్కువగా తిరుగుతున్నా. ఇంట్లో ఏదో వాస్తు దోషం ఉందని అర్థం చేసుకోవాలి.

నోట్‌: పైన తెలిపిన విషయాలు పలువురు వాస్తు పండితులు, వాస్తు శాస్త్రంలో తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో ఎలాంటి శాస్త్రీయత లేదని రీడర్స్‌ గమనించాలి.

మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

ప్రియురాలితో అడ్డంగా దొరికిన భర్త.! చెంప చెల్లుమనిపించిన హీరోయిన్
ప్రియురాలితో అడ్డంగా దొరికిన భర్త.! చెంప చెల్లుమనిపించిన హీరోయిన్
టాలీవుడ్‌లో దారుణం.. కుళ్లిన స్థితిలో లేడీ ప్రొడ్యూసర్ శవం.!
టాలీవుడ్‌లో దారుణం.. కుళ్లిన స్థితిలో లేడీ ప్రొడ్యూసర్ శవం.!
కల్కిలో కృష్ణుడిగా మహేష్ బాబు.! షాకింగ్ ఆన్సర్ ఇచ్చిన నాగి..
కల్కిలో కృష్ణుడిగా మహేష్ బాబు.! షాకింగ్ ఆన్సర్ ఇచ్చిన నాగి..
రైలంత బస్సులు రయ్‌.. రయ్‌.! టాటా సహకారంతో 132 సీట్లతో బస్సులు..
రైలంత బస్సులు రయ్‌.. రయ్‌.! టాటా సహకారంతో 132 సీట్లతో బస్సులు..
మాట నిలబెట్టుకోవడం అంటే ఇది.! పవన్‌పై ప్రశంసలు..
మాట నిలబెట్టుకోవడం అంటే ఇది.! పవన్‌పై ప్రశంసలు..
ఏటా 33 వేల మందిని మింగేస్తున్న వాయుకాలుష్యం.!
ఏటా 33 వేల మందిని మింగేస్తున్న వాయుకాలుష్యం.!
ఇవి తింటే చాలు.. ఫుల్ హెల్త్.! ఏ ఆహారం తినాలి.? ఎంత తినాలి.?
ఇవి తింటే చాలు.. ఫుల్ హెల్త్.! ఏ ఆహారం తినాలి.? ఎంత తినాలి.?
బద్దకస్తులారా పారా హుషార్.. ఇంకా బద్దకిస్తే ఆ షాక్ తప్పదు.!
బద్దకస్తులారా పారా హుషార్.. ఇంకా బద్దకిస్తే ఆ షాక్ తప్పదు.!
తరచుగా మల్టీ విటమిన్‌ టాబ్లెట్స్‌ వేసుకుంటున్నారా? అయితే ఇది మీకే
తరచుగా మల్టీ విటమిన్‌ టాబ్లెట్స్‌ వేసుకుంటున్నారా? అయితే ఇది మీకే
కొడుకుతో చూసి పాండ్య ఎమోషనల్‌.. నటాషా విస్సింగ్‌.!
కొడుకుతో చూసి పాండ్య ఎమోషనల్‌.. నటాషా విస్సింగ్‌.!