గ్లోయింగ్ స్కిన్ కోసం కత్తిలాంటి టిప్స్

TV9 Telugu

08 JULY 2024

చిన్న నుండి పెద్దవారి వరకు ముఖారవిందం కోసం అనేక ప్రయత్నాలు చేస్తుంటారు.. వారిలో ముఖ్యంగా మహిళలు ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటుంటారు.

ముఖం అందం కోసం బయట దొరికే అనేక రకరకాల బ్యూటీ ప్రొడక్ట్స్ వాడుతుంటారు. అయితే వాటిలోని రకాల కెమిల్స్ వల్ల అందంగా ఉండకపోగా అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

ఇలా కాకుండా ఉంటాలంటే మన ఇంట్లో దొరికే సహజ ఉత్పత్తులతోనే మన చర్మాన్ని మెరిసేలా చేసుకోవచ్చు. అవేంటో ఇప్పుడు తెల్సుకుందాం.

ముఖం మీద మచ్చలు తొలగించడానికి కాఫీపొడిలో ఒక స్పూన్ శెనగపిండి, ఒక స్పూన్ తేనె, చిటెకెడు పసుపు, కొంచెం పెరుగు వేసి మిక్స్ చేసి ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల తరువాత శుభ్రం చేసుకోండి.

ముఖం మెరుపు కోసం కొద్దీ పాలల్లో ఒక స్పూన్ నిమ్మరసం కొంచె తేనె కలిపి ముఖానికి అప్లై  చేసి తర్వాత చల్లటి నీటితో కడిగితే మంచి ఫలితం ఉంటుంది.

జిడ్డు చర్మం ఉన్నవారు ఒక చిన్న టమోటోతో ముఖానికి మసాజ్ చేసుకోవచ్చు. ఇవి చర్మం మెరిసేలా చేస్తుంది. ముఖం పై మురికిని, బ్లాక్ హెడ్స్ ని తొలగిస్తుంది.

చర్మ సమస్యలు ఉన్నవారు  నీటిలో కొంచెం పటిక వేసి ఒక ఐదు నిముషాలు అలానే ఉంచి.. ఆతర్వాత స్నానం చేస్తే చర్మ సమస్యలు తొలగిపోతాయి.

బంగాళదుంపను మెత్తగా చేసి ఆ రసాన్ని ముఖంపై అప్లై చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఇవి ముఖంపై మురికిని తొలగించడంలో సహాయపడతాయి.