ట్వీట్ చేశాడు.. సమస్యకు పరిష్కారం పొందాడు.. ఈ విద్యార్థి చేసిన పనికి శభాష్ అనాల్సిందే..

సోషల్ మీడియాను కొంత మంది చెడుకు.. మరికొంత మంది మంచి కోసం ఉపయోగించుకుంటున్నారు. ఇటీవల చాలావరకు తమ ఇబ్బందుల్ని, సమస్యలను సామాజిక

  • Rajitha Chanti
  • Publish Date - 10:39 am, Tue, 12 January 21
ట్వీట్ చేశాడు.. సమస్యకు పరిష్కారం పొందాడు.. ఈ విద్యార్థి చేసిన పనికి శభాష్ అనాల్సిందే..

సోషల్ మీడియాను కొంత మంది చెడుకు.. మరికొంత మంది మంచి కోసం ఉపయోగించుకుంటున్నారు. ఇటీవల చాలావరకు తమ ఇబ్బందుల్ని, సమస్యలను సామాజిక మాధ్యమాల ద్వారా నేరుగా అధికారులకు విన్నవించుకుంటున్నారు. దీంతో ఆ సమస్యలకు వెంటనే పరిష్కారం దొరికేస్తుంది. ఇలాగే ఒడిశాలోని భువనేశ్వర్‏కు చెందిన ఓ పాఠశాల విద్యార్థి కూడా తనకు ఏర్పడిన సమస్యను ట్విట్టర్ ద్వారా అధికారులు తెలిపి ఆ ఇబ్బందికి పరిష్కారం పొందాడు.

భువనేశ్వర్‏కు చెందిన సాయి అన్వేష్ స్థానికంగా ఉన్న ఎంబీఎస్ పాఠశాలలో చదువుకుంటున్నాడు. అయితే ఆ విద్యార్థి స్కూల్‏కు 7.30 గంటలకు చేరుకోవాలి. కానీ తను వెళ్ళాల్సిన బస్సు మాత్రం 7.40కి తను ఉండే ప్రాంతానికి వస్తుంది. దీంతో స్కూల్‏కు ఆలస్యంగా వెళ్లాల్సి వస్తోందని.. ఇదే విషయాన్ని భువనేశ్వర్ క్యాపిటల్ అర్బన్ రవాణా శాఖకు, సీఆర్‏యూటీ ఎండీ, ఐపీఎస్ అధికారి అరుణ్ బాత్రాకు ట్విట్టర్‏లో ట్యాగ్ చేశాడు.

దీంతో ఆ విద్యార్థి ట్వీ్ట్‏కు అరుణ్ బాత్రా స్పందిస్తూ.. సాయికి కలిగిన ఇబ్బందిని పరిష్కారిస్తూ.. ఇకనుంచి ఉదయం 7 గంటలకే సాయి ప్రాంతానికి బస్సు వస్తుంది అంటూ రీట్వీట్ చేసాడు. ఆ తర్వాత బస్సు వేళ్ళల్లో మార్పులు చేస్తూ సీఆర్‏యూటీ షెడ్యూల్ విడుదల చేసింది. ఆ తర్వాతి రోజు సాయి ప్రాంతానికి ఉదయం 7 గంటలకే బస్సు వచ్చింది. బస్సు ఎక్కిన సాయి ఫోటోను.. అరుణ్ ట్వీట్‏లో షేర్ చేశారు. ప్రస్తుతం ఆ ఫోటో నెట్టింట్లో వైరల్‏గా మారింది.

Also Read: విద్యార్థి హాల్‌టికెట్‌పై సన్నీలియోన్ పేరు.. సోషల్ మీడియాలో వైరల్.. ఫన్నీ రియాక్షన్ ఇచ్చిన హాట్ బ్యూటీ..

టాలీవుడ్ టాప్ హీరోతో జతకట్టనున్న కేజీఎఫ్ డైరెక్టర్.. ఇంతకీ వీరిద్దరి కాంబినేషన్‏లో నిజంగానే మూవీ రాబోతుందా?